Kanna Lakshmi Narayana AP : ఏపీలో ఫ్యాక్షనిజం పోలీసు రాజ్యం
నిప్పులు చెరిగిన కన్నా లక్ష్మీనారాయణ
Kanna Lakshmi Narayana AP : మాజీ మంత్రి, మాజీ బీజేపీ స్టేట్ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshmi Narayana AP) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఏపీలో కొలువు తీరిన జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రాచరిక, రాక్షస పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.
పోలీసు రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే బీజేపీకి గుడ్ బై చెప్పిన కన్నా లక్ష్మీనారాయణ తాను ఏ పార్టీలో చేరుతున్నాననే దానిపై కొనసాగుతూ వస్తున్న ఉత్కంఠకు తెర దించారు.
ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఇక నుంచి తాను జగన్ ప్రభుత్వంపై యుద్దం చేస్తానని ప్రకటించారు. పనిలో పనిగా తేదీ కూడా ఖరారు చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి మంతనాలు కూడా పూర్తయినట్లు తెలిపారు. ఏపీలో రోజు రోజుకు అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు.
జగన్ రెడ్డి ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ పెంచి పోషిస్తున్నారంటూ ఆరోపించారు కన్నా లక్ష్మీ నారాయణ(Kanna Lakshmi Narayana AP). గన్నవరంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్ల పోలీసులు, సర్కార్ వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు రాష్ట్రంలో స్వేచ్ఛ అన్నది లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. తాను 2 వేల మంది అనుచరులు, నాయకులతో కలిసి ఫిబ్రవరి 24న టీడీపీలో చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కన్నా చేరికతో తనకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు రాయపాటి.
Also Read : సవాళ్ల పర్వం హీటెక్కిన గన్నవరం