Narendra Modi : వైఫ‌ల్యాలు విజ‌యానికి సోపానాలు – పీఎం

ఇత‌ర పార్టీలను గుడ్డిగా విమ‌ర్శించొద్దు

Narendra Modi : దేశ ప్ర‌ధాన మంత్రి మోదీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇత‌ర పార్టీల నుంచి నేర్చుకోవాలే త‌ప్ప విమ‌ర్శ‌ల‌కు దిగ‌వ‌ద్దంటూ పార్టీ శ్రేణుల‌కు సూచించారు.

సికింద్రాబాద్ లో జ‌రిగిన బీజేపీ విజ‌య సంక‌ల్ప యాత్ర సభ‌లో ప్ర‌సంగించారు మోదీ. దేశ వ్యాప్తంగా బీజేపీకి జ‌నాద‌ర‌ణ ల‌భిస్తోంద‌న్నారు. 2019 నుంచి తెలంగాణ‌లో ఎదురే లేకుండా పోయింద‌న్నారు.

దీనిని మ‌నం అధికారంలోకి వ‌చ్చేలా చేసుకోవాల‌ని కోరారు. ఇందుకు ఒక్క‌టే మార్గం క‌ష్ట‌ప‌డి కృషి చేయ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు. పార్టీ యంత్రాంగం శ‌క్తి వంచ‌న లేకుండా ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్పారు మోదీ(Narendra Modi) .

ప‌ని చేసుకుంటూ పోతే ప్ర‌జ‌లు త‌ప్ప‌క ఆద‌రిస్తార‌ని స్ప‌ష్టం చేశారు. ఆక‌ర్ష‌ణ రాజ‌కీయాలు ఎప్ప‌టికీ క్షేమం కాద‌న్నారు. అన్ని వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం బీజేపీ కేంద్ర స‌ర్కార్ చేస్తున్న కృషిని పార్టీకి చెందిన శ్రేణులు ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని దిశా నిర్దేశం చేశారు.

స‌మాజంలోని ప్ర‌జ‌లంద‌రి ప్రేమ‌ను, గౌర‌వాన్ని పొందేందుకు కార్య‌క‌ర్త‌లు స్నేహ యాత్ర చేప‌ట్టాల‌న్నారు. రాజ‌కీయ‌, పాల‌నా వ్య‌వ‌హారాల‌లో ప్ర‌జానుకూల‌, సుప‌రిపాల‌న విధానాలు అవ‌లంభించాల‌ని స్ప‌ష్టం చేశారు.

దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పాలించిన పార్టీలు నిష్క్ర‌మించే దారిలో ఉన్నాయ‌ని, అవి ఉనికి కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని అన్నారు మోదీ. వార‌స‌త్వ రాజ‌కీయాలు, కుటంబ పాల‌న ప‌ట్ల ప్ర‌జ‌లు విసిగి వేసారి పోయార‌ని చెప్పారు.

దేశంలోని మంచి అంద‌రికీ పంచాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్నారు మోదీ. స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్య‌క్తి అయిన‌ప్ప‌టికీ తాము ఆయ‌న‌ను దేశానికి దిశా నిర్దేశం చేసిన ఐర‌న్ మ్యాన్ గా గుర్తించామ‌ని చెప్పారు ప్ర‌ధాన మంత్రి.

Also Read : ప‌టేల్ వ‌ల్లే నిజాం పాల‌న‌కు విముక్తి – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!