Falakunuma Express Fire : ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో మంటలు
తగల బడిన రెండు బోగీలు
Falakunuma Express Fire : హౌరా నుంచి సికింద్రాబాద్ వైపు వస్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్(Falaknuma Express) రైలు లో మంటలు చెలరేగారు. శుక్రవారం యాదాద్రి భువనగరి జిల్లాలో చోటు చేసుకుంది. రెండు బోగీలు అంటుకున్నాయి. పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. పగిడిపల్లి – బొమ్మాయిపల్లి మధ్య చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ లోని హౌరా నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. బోగిల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వెంటనే రైలు సిబ్బంది అప్రమత్తం అయ్యారు.
దీంతో తక్షణమే ఫలక్ నుమా ట్రైన్ ను నిలిపి వేశారు. ప్రయాణీకులు బోగీల నుంచి దూకారు. ఒకవేళ రైలు సిబ్బంది అప్రమత్తం కాక పోయి ఉంటే ఘోర ప్రమాదం చోటు చేసుకుని ఉండేది. దీంతో పెద్ద ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణీకులను సురక్షితంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
విషయం తెలిసిన వెంటనే అగ్ని మాపక కేంద్రం సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఒక బోగి నుంచి మరో బోగికి అంటుకోవడంతో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. చుట్టు పక్కల ప్రాంతమంతా ఇబ్బందికరంగా మారింది. ఘటన జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ట్రైన్ వద్దకు చేరుకున్నారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితుల గురించి వాకబు చేశారు.
Also Read : Bandi Sanjay : అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే