Justice Madan Lokur : ఆర్టీఐ కార్య‌క‌ర్త‌ల‌పై త‌ప్పుడు కేసులు

ఆవేద‌న వ్య‌క్తం చేసిన జ‌స్టిస్ లోకూర్

Justice Madan Lokur : స‌మ‌చార హ‌క్కు చ‌ట్టానికి (ఆర్టీఐ) సంబంధించి కార్య‌క‌ర్త‌ల‌ను త‌ప్పుడు కేసుల్లో ఇరికించ‌డంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి మ‌ద‌న్ బి లోకూర్(Justice Madan Lokur) ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

బౌతిక బెదిరింపులు, హింస‌ను ఎదుర్కొంటున్న ఒడిశా లోని ఆర్టీఐ కార్య‌క‌ర్త‌ల‌పై ఎఫ్ఐఆర్ లు న‌మోద‌య్యాయి. భువ‌నేశ్వ‌ర్ లో ఆర్టీఐ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు, ఒడిశాలో విజిల్ బ్లోయ‌ర్ల ర‌క్ష‌ణే అనే అంశంపై బ‌హిరంగ విచార‌ణ‌లో ప్ర‌సంగించారు.

ఆర్టీఐ కార్య‌క‌ర్త‌ల‌పై కౌంట‌ర్ ఎఫ్ఐఆర్ లు న‌మోదు చేస్తున్నామన్నారు. ఉద్య‌మ‌కారుల అస‌లు ఎఫ్ఐఆర్ ల‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోన‌ప్పుడు హింస చెల‌రేగుతుంద‌న్నారు.

అనేక కేసుల‌లో పోలీసులు మొద‌ట‌గా ఎఫ్ఐఆర్ న‌మోదు చేసే ఎఫ్ఐఆర్ సీరియ‌ల్ నంబ‌ర్ ను మార్చార‌ని సంచ‌ల‌న విష‌యాన్ని వెలుగులోకి తీసుకు వ‌చ్చారు.

ఇది ఆందోళ‌న క‌లిగించే విష‌యం అన్నారు జ‌స్టిస్ మ‌ద‌న్ లోకూర్(Justice Madan Lokur). పోలీసుల అవ‌క‌త‌వ‌క‌ల‌ను త‌నిఖీ చేయాల‌న్నారు.

కొన్ని సంద‌ర్భాల్లో అత్యాచారం కేసుల‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టం కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డం వ‌ల్ల ఆర్టీఐ కార్య‌క‌ర్త‌లపై వారాల కొద్దీ లేట్ అవుతుంద‌ని , బెయిల్ పొంద‌డం మ‌రింత క‌ష్టంగా మారుతుంద‌న్నారు.

అనేక సంద‌ర్భాల‌లో పోలీసులు ఆర్టీఐ కార్య‌క‌ర్త‌చే ఎఫ్ఐఆర్ లు కూడా న‌మోదు చేయ‌డం లేద‌ని మండిప‌డ్డారు మాజీ జ‌స్టిస్. ప‌లువురు ఆర్టీఐ కార్య‌క‌ర్త‌లు తాము ఎలా దాడుల‌కు గుర‌వుతున్నామో చెప్పారు.

త‌ప్పుడు కేసులు ఎదుర్కొంటున్న ఆర్టీఐ కార్య‌క‌ర్త‌లు న‌ష్ట ప‌రిహారం పొందాల‌న్నారు. కార్య‌క‌ర్త‌ల‌కు రాష్ట్ర సేవాధికార సంస్థ న్యాయ స‌హాయం అందించాల‌ని సూచించారు జ‌స్టిస్ మ‌ద‌న్ లోకూర్.

Also Read : నితీశ్ ఎక్క‌డ పోటీ చేసినా ఓట‌మి ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!