PM Modi Telangana : తెలంగాణలో అవినీతి..కుటంబ పాలన – మోదీ
నన్ను..బీజేపీని తిడితే లాభం ఏమిటి
PM Modi Telangana : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ప్రధానంగా ప్రత్యేకంగా ప్రస్తావించకుండానే సీఎం కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని ఏకి పారేశారు. రెండు రోజుల టూర్ లో భాగంగా నిన్న ఏపీలో పర్యటించారు. శనివారం తెలంగాణలోని రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. నన్ను, భారతీయ జనతా పార్టీని తిడుతూనే ఉండండి కానీ తెలంగాణ(PM Modi Telangana) ప్రజలను దుర్భాషలాడితే భారీ మూల్యం చెల్లించు కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక రకంగా గతంలో ఎన్నడూ ఈ రకమైన భాషను ప్రధాన మంత్రి వాడలేదు.
ఒక రకంగా సీఎం కేసీఆర్ కు ప్రత్యక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లు అనుకోవాల్సి వస్తుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రానికి కావాల్సింది ప్రజలేనని కుటుంబం కాదన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో అవినీతి పెరిగి పోయిందని మండిపడ్డారు. మీరు రోజు ఇంత ఉల్లాసంగా ఎలా ఉంటారంటూ చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు.
ఎందుకంటే నేను కేసీఆర్ లాంటి వాళ్లు రోజూ తిడుతూ ఉంటారని వాటిని ఆస్వాదిస్తూ ఉండడం వల్లనే తాను బలంగా ఉన్నానని ఎద్దేవా చేశారు నరేంద్ర మోదీ. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ చేపడుతున్న అభివృద్ది పథకాలను ఇక్కడి టీఆర్ఎస్ సర్కార్ కావాలని అడ్డుకుంటోందని ఆరోపించారు ప్రధానమంత్రి. సామాజిక న్యాయంకు ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు.
ఆన్ లైన్ చెల్లింపుల వల్ల సాధ్యమైనంత మేర అవినీతికి ఆస్కారం ఏర్పడదన్నారు మోదీ.
Also Read : ప్రధాని టూర్ కు కేసీఆర్ డుమ్మా