Farhana Movie : ఉత్కంఠ భరితం ఫర్హానా చిత్రం
ఆకట్టుకున్న ఐశ్వర్య రాజేష్ నటన
Farhana Movie : కొన్ని సినిమాలు ఆలోచన కలిగించేలా చేస్తాయి. ఇంకొన్ని గుండెల్ని మీటుతాయి. మరికొన్ని మరిచి పోలేకుండా చేస్తాయి. టెక్నాలజీ మాయలో పడినా ఎక్కడా నేటివిటీ దెబ్బ తినకుండా తీయడంలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు వారిని ప్రత్యేకంగా అభినందించి తీరాల్సిందే. అటు కమర్షియల్ సినిమాలే కాదు ఇటు కళాత్మక, సామాజిక నేపథ్యంలో కలిగిన చిత్రాలు కూడా తీస్తూ తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు.
ఈ మధ్యే మారి సెల్వరాజ్ ధనుష్ తో తీసిన చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. తాజాగా నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఫర్హానా(Farhana) చిత్రం విడుదలైంది. భారీ ఎత్తున ఆదరణ చూరగొంటోంది ఈ మూవీ. ఇందులో ఐశ్వర్య రాజేష్ , సెల్వ రాఘవన్ , ఐశ్వర్య దత్తా, జితన్ రమేష్ , అనుమోల్ నటించారు. ఒక రకంగా దర్శకుడి అంచనాలకు మించి పాత్రల్లో జీవించారు. ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ఫర్హానాను నిర్మించారు. జస్టిస్ ప్రభాకరన్ చిత్రానికి సంగీతం అందించారు. గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రఫీ అందించాడు.
ఫర్హానా ఓ పవిత్రమైన ముస్లిం మహిళ. తన ఫ్యామిలీని ఆర్థికంగా పోషించేందుకు కాల్ సెంటర్ లో జాబ్ చేస్తుంది. ఇక్కడ కాలర్స్ తో మాట్లాడటం ఆమె పని. అనుకోకుండా ఒకరి వాయిస్ తో అనుబంధం ఏర్పడుతుంది. అతడి పట్ల అభిమానం కూడా కలుగుతుంది. ఒక భావోద్వేగమైన బంధాన్ని పెంచుకుంటుంది. చివరకు ఏమవుతుందనే దానిపై తెరపై అద్బుతంగా చిత్రీకరించాడు నెల్సన్ వెంకటేశన్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా.
Also Read : RS Praveen Kumar : బంగారు తెలంగాణలో జీతాలు రాలే