Darshan Pal : స‌ర్కార్ ఆహ్వానం రైతు సంఘాలు ఆగ్ర‌హం

ఫోన్ కాల్ చేయ‌డం పై సీరియ‌స్

Darshan Pal  : కేంద్ర ప్ర‌భుత్వం పిలుపునిచ్చిన ఆహ్వానాన్ని రైతు సంఘాలు తిర‌స్క‌రించాయి. రాత పూర్వ‌కంగా ఈరోజు వ‌ర‌కు హామీ ఇవ్వ‌లేదంటూ పేర్కొన్నాయి.

వివాదాస్ప‌ద‌మైన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను త‌మ ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించు కోనున్న‌ట్లు గ‌త ఏడాది న‌వంబ‌ర్ 19న ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించారు.

దీంతో సాగు చ‌ట్టాల‌ను పార్ల‌మెంట్ ర‌ద్దు చేసింది. రైతుల డిమాండ్ల‌ను ప‌రిశీలించేందుకు ఒక క‌మిటీని కూడా ప్ర‌తిపాదించింది. దీంతో రైతు సంఘాలు 13 నెల‌ల పాటు సాగిన ఆందోళ‌న‌ను విర‌మించుకున్నాయి.

గ‌త ఏడాది భారీ ఆందోళ‌న‌కు నాయ‌క‌త్వం వ‌హించిన సంయుక్త కిసాన్ మోర్చా – ఎస్కేఎం వ్య‌వ‌సాయ స‌మ‌స్య‌ల‌ను ప‌రిశీలించేందుకు ప్ర‌తిపాదిత క‌మిటీలో పాల్గొనేందుకు గాను కేంద్ర స‌ర్కార్ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించింది.

ప్ర‌భుత్వం ఎలాంటి ఆహ్వానాన్ని రాత పూర్వ‌కంగా తెలియ చేయ‌లేదు. ఏదో ఫోన్ కాల్ ద్వారా చేస్తే తాము ఎలా హాజ‌ర‌వుతామంటూ ప్ర‌శ్నించింది.

అనేక రాష్ట్రాల‌లో వ్యాపించిన ఆందోళ‌న 10 వేల మంది రైతుల‌ను వీధుల్లోకి తీసుకు వ‌చ్చింది. కాగా ఉత్త‌ర ప్ర‌దేశ్ తో స‌హా ఐదు రాష్ట్రాల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీని ప్ర‌భావితం చూప లేక పోయింది.

చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌డం వ‌ల్ల 11 రౌండ్ల చ‌ర్చ‌లు జ‌రిగాయి. ప్ర‌తి స‌మావేశం విఫ‌ల‌మైంది. చివ‌ర‌కు కేంద్ర స‌ర్కార్ దిగి వ‌చ్చింది. రాత పూర్వ‌కంగా కేంద్ర స‌ర్కార్ త‌మ‌ను ఆహ్వానించ లేదు.

ఇద్ద‌రు స‌భ్యుల‌ను నామినేట్ చేయ‌మ‌ని ఫోన్ కాల్ వ‌చ్చిందంటూ వెల్ల‌డించారు వ్య‌వ‌సాయ నాయ‌కుడు ద‌ర్శ‌న్ పాల్(Darshan Pal ). ప్ర‌స్తుతం తిర‌స్క‌రించ‌డం హాట్ టాపిక్ గా మారింది.

Also Read : కాంగ్రెస్ పార్టీ కీల‌క స‌మావేశం

Leave A Reply

Your Email Id will not be published!