Farmers Protest : ల‌ఖింపూర్ ఖేరీలో రైతుల ఆందోళ‌న

మంత్రిని బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్

Farmers Protest : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని ల‌ఖిం పూరి ఖేరి. రైతుల‌తో పాటు ఓ జ‌ర్న‌లిస్ట్ ను చంపారు కేంద్ర మంత్రి త‌నయుడు. అత‌డు జైలులోనే ఉన్నాడు. బెయిల్ కోసం వెయిటింగ్ చేస్తున్నాడు.

ఈ రోజు వ‌ర‌కు మోదీ ప్ర‌భుత్వం మాయ మాట‌లు చెప్ప‌డం త‌ప్ప సాయం చేసిన పాపాన పోలేదు. స‌ర్కార్ తీరును నిరసిస్తూ బాధితులు ఆందోళ‌న‌కు దిగారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వ‌ర్యంలో మూడు రోజుల నిర‌స‌న‌కు(Farmers Protest) శ్రీ‌కారం చుట్టారు.

త‌మ‌కు న్యాయం జ‌రిగేంత దాకా పోరాటం ఆగ‌ద‌న్నారు. కేంద్ర స‌హాయ శాఖ మంత్రి అజ‌య్ మిశ్రాను బ‌ర్త‌ర‌ఫ్ చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ల‌ఖింపూర్ ఖేరిలో గురువారం నుంచి 72 గంట‌ల నిర‌స‌న‌కు దిగారు.

పంజాబ్ కు చెందిన 10,000 మంది రైతులు ఈ ఆందోళ‌న‌లో పాల్గొంటున్నారు. ఈ విష‌యాన్ని భార‌తీయ కిసాన్ యూనియ‌న్ (దోబా) అధ్య‌క్షుడు మంజిత్ సింగ్ రాయ్ స్ప‌ష్టం చేశారు.

కొంద‌రు రైళ్ల‌లో, మ‌రికొంద‌రు సొంత వాహ‌నాల‌పై, బ‌స్సుల ద్వారా చేరుకుంటార‌ని చెప్పారు. ఇప్ప‌టికే చాలా మంది రైతులు అక్క‌డికి చేరుకున్నారు.

గ‌త ఏడాది అక్టోబ‌ర్ లో ల‌ఖింపూర్ ఖేరీలో న‌లుగురు రైతుల‌తో పాటు ఎనిమిది మందిని చంపిన కేసులో అరెస్ట్ అయిన కేంద్ర స‌హాయ మంత్రి అజ‌య్ మిశ్రాను బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఏడాది జూలై నాటికి రైతుల‌ను చిత‌క బాదిన కార్ల‌లో ఒక దానిలో కూర్చున్న ఆశిష్ మిశ్రాకు కోర్టు బెయిల్ ఇవ్వ‌డాన్ని నిరాక‌రించింది.

Also Read : నేనింకా షాక్ లోనే ఉన్నా – బిల్కిస్ బానో

Leave A Reply

Your Email Id will not be published!