Kamareddy Bandh : స‌ర్కార్ పై రైత‌న్న‌ల క‌న్నెర్ర‌

కామారెడ్డిలో టెన్ష‌న్ టెన్ష‌న్

Kamareddy Bandh : త‌మ‌ను చంపినా స‌రే త‌మ భూముల‌ను ఇచ్చే ప్ర‌స‌క్తి లేదంటున్నారు కామారెడ్డి రైతులు. త‌ర త‌రాల నుంచి కాపాడుకుంటూ వ‌స్తున్నామ‌ని కానీ త‌మ క‌డుపు కొడ‌తామంటే ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు.

కామారెడ్డి మాస్ట‌ర్ ప్లాన్ పేరుతో త‌మ భూముల‌ను కాజేయాల‌ని చూస్తే ఖ‌బ‌డ్దార్ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మాస్ట‌ర్ ప్లాన్ కు వ్య‌తిరేకంగా శుక్ర‌వారం కామారెడ్డి బంద్ కు పిలుపునిచ్చారు రైత‌న్న‌లు(Kamareddy Bandh). దీంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

భారీ ఎత్తున పోలీసుల‌ను మోహ‌రించారు. కామారెడ్డి పుర‌పాలిక సంస్థ మాస్ట‌ర్ ప్లాన్ త‌యారు చేసింది. ఈ నిర్ణ‌యాన్ని తాము ఒప్పుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు రైతులు. సంయుక్త కార్యాచ‌ర‌ణగా ఏర్పాట‌య్యారు.

గ‌త కొన్ని రోజులుగా మాస్ట‌ర్ ప్లాన్ కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న బాట ప‌ట్టారు. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని, లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు రైత‌న్న‌లు.

కామారెడ్డి బంద్ కు పిలుపు ఇవ్వ‌డంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న టెన్ష‌న్ నెల‌కొంది. ఈ నిర్ణ‌యాన్ని ఒప్పుకోమంటూ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఆందోళ‌న బాట ప‌ట్టారు. మీ మాస్ట‌ర్ ప్లాన్ మీ వ‌ద్ద‌నే ఉంచుకోండి. మాకు చెందిన సెంటు భూమిని ఇచ్చే ప్ర‌స‌క్తి లేదంటున్నారు రైత‌న్న‌లు.

ఇండ‌స్ట్రియ‌ల్ జోన్ , గ్రీన్ జోన్ , క‌మ‌ర్షియ‌ల్ జోన్ , రెసిడెన్షియ‌ల్ జోన్ పేరుతో కామారెడ్డి పుర‌పాలిక సంస్థ మాస్ట‌ర్ ప్లాన్ త‌యారు చేసింది. కామారెడ్డితో పాటు అడ్లూర్, టెకిర్యాల్ , కాల్సిపూర్ , దేవునిప‌ల్లి, లింగాపూర్ , స‌రంప‌ల్లి, పాత‌రాజంపేట‌, రామేశ్వ‌రంప‌ల్లి ప‌ల్లెలు ఉన్నాయి.

ఈ ప్లాన్ ను ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ‌తతో గీయించారు. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌కు ఊతం ఇచ్చేలా నిర్ణ‌యం తీసుకున్నారంటూ రైతులు భ‌గ్గుమ‌న్నారు.

Also Read : విచార‌ణ చ‌ట్ట పాల‌న‌కు వెన్నెముక

Leave A Reply

Your Email Id will not be published!