Farmers Protest : హర్యానా సర్కార్ పై రైతన్నల కన్నెర్ర
నిప్పులు చెరిగిన రైతు ఉద్యమ నేతలు
Farmers Protest : రైతులు నిప్పులు చెరిగారు. హర్యానా ప్రభుత్వంపై భగ్గుమన్నారు. కావాలని కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించాలని కోరుతూ రైతులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్రంలోని కురుక్షేత్రలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వారు చేపట్టిన నిరసన రెండో రోజుకు చేరుకుంది. మంగళవారం రైతు ఉద్యమ నేతలతో పాటు భారత కిసాన మోర్చా జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ , సంయుక్త కిసాన్ మోర్చా నేత నరేష్ టికాయత్ ఆధ్వర్యంలో ఇవాళ రైతులు పెద్ద ఎత్తున సమావేశం అయ్యారు.
గత కొంత కాలంగా రైతులు తాము పండించిన పంటకు కనీస మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రైతులపై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు రాకేశ్ టికాయత్. దీనిని ఖండించారు. రాబోయే రోజుల్లో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పండించిన పంటకు ధర ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న హర్యానా సర్కార్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు రాకేశ్ టికాయత్.
లేక పోతే రైతులు(Farmers Protest) మరింత పోగవుతారని, ప్రభుత్వ దమన నీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారని హెచ్చరించారు. గతంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సందర్బంగా మోదీ ప్రభుత్వం ఎంఎస్పీ ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ బీజేపీ సర్కార్ పట్టించుకోక పోవడం దారుణమన్నారు రాకేశ్ టికాయత్.
Also Read : YS Sharmila : కేసీఆర్ ప్రచారానికి ఎక్కువ పనికి తక్కువ
