Farooq Abdullah Rahul Yatra : రాహుల్ కు ఫరూక్ అబ్దుల్లా భరోసా
భారత్ జోడో యాత్రలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
Farooq Abdullah Rahul Yatra : జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం , నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. దేశం విడిపోవద్దని, కులం, మతం పేరుతో కొట్లాడు కోవద్దంటూ , అంతా కలిసికట్టుగా జీవించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు.
ఆయన చేపట్టిన యాత్ర ఇప్పటికే 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బుధవారం ఉత్తర ప్రదేశ్ లో కొనసాగుతోంది పాదయాత్ర. ఇదిలా ఉండగా ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) రాహుల్ గాంధీతో కలిసి అడుగులో అడుగు వేశారు. ఆపై రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని ఆలింగనం చేసుకున్నారు.
వారికి తన సంపూర్ణ సహకారాన్ని, మద్దతును ప్రకటించారు. ఇప్పటికే 10 రాష్ట్రాలలో ఆయన పర్యటన పూర్తయింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ , రాజస్థాన్ , ఢిల్లీలో ముగిసింది. తిరిగి రెండో దశ భారత్ జోడో యాత్ర ఉత్తర ప్రదేశ్ లో కొనసాగుతోంది.
ఏకంగా రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. యువతీ యువకులతో పాటు అన్ని వర్గాలకు చెందిన వారు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఓ వైపు మాజీ సీఎం అబ్దుల్లా(Farooq Abdullah) పాల్గొంటే రా వింగ్ మాజీ చీఫ్ ఏఎస్ దులత్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి మద్ధతుగా నిలిచారు.
మరో వైపు అయోధ్య రామాలయం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ , రామ మందిరం ట్రస్టు కార్యదర్శి చింతన్ రాయ్ కూడా రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రను ప్రశంసలు కురిపించారు.
Also Read : దేశానికి మానవత్వమనే మతం కావాలి