Rishi Sunak : స్త్రీల‌కు పురుషాంగం లేదా

రిషి సున‌క్ షాకింగ్ కామెంట్స్

Rishi Sunak : బ్రిట‌న్ ప్ర‌ధాన‌మంత్రి రిషి సున‌క్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వంద శాతం స్త్రీల‌కు పురుషాంగం లేదా అని అడిగారు. బ్రిట‌న్ లింగ చ‌ట్టాల‌పై చ‌ర్చిస్తున్న త‌రుణంలో రిషి సున‌క్ కామెంట్స్ వెలుగులోకి వ‌చ్చాయి. ఈ సంవ‌త్స‌రం ప్రారంభంలో స్కాట్లాండ్ ప్ర‌వేశ పెట్టిన లింగ సంస్క‌ర‌ణ బిల్లుల‌ను బ్రిటిష్ ప్ర‌భుత్వం నిరోధించింది.

ట్రాన్స్ జెండ‌ర్ల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ జరుగుతున్న నేప‌థ్యంలో మ‌హిళ‌ల‌కు పురుషాంగం లేద‌ని బ్రిట‌న్ పీఎం అన్నారు. క‌న్జ‌ర్వేటివ్ హోమ్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో లేబ‌ర్ పార్టీ చీఫ్ , బ్రిటిష్ పార్ల‌మెంట్ లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు స‌ర్ కీర్ స్ట్రామ‌ర్ ఇటీవ‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌పై 99.9 శాతం మంది మ‌హిళ‌ల‌కు పురుషాంగం లేద‌న్నారు రిషి సున‌క్(Rishi Sunak) .

మీరు దానిని ఎంత శాతంలో ఉంచుతారంటూ వేసిన ప్ర‌శ్న‌కు పీఎం న‌వ్వారు. అవును, అయితే అంటూ బ‌దులు ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌స్తుతం రిషి సున‌క్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

త‌మ లింగాన్ని మార్చు కోవ‌డం గురించి ఆలోచించే వారి ప‌ట్ల మ‌నం ఎల్ల‌ప్పుడూ క‌నిక‌రం , అవ‌గాహ‌న‌, స‌హ‌నం క‌లిగి ఉండాల‌ని పేర్కొన్నారు. కానీ మ‌హిళ‌ల హ‌క్కులు, మ‌హిళ‌ల స్థ‌లాల‌ను ర‌క్షించే ఈ స‌మ‌స్య‌ల విష‌యానికి వ‌స్తే మ‌నం ఆ ప్ర‌శ్న‌ల గురించిన‌ప్పుడు జీవ సంబంధ‌మైన సెక్స్ స‌మ‌స్య ప్రాథ‌మికంగా ముఖ్య‌మైన‌దంటూ తాను భావిస్తున్న‌ట్లు చెప్పారు రిషి సున‌క్.

Also Read : మ‌రోసారి బాలిస్టిక్ క్షిప‌ణి ప్ర‌యోగం

Leave A Reply

Your Email Id will not be published!