Nadhim Zahawi : లిజ్ ట్రస్ కు ఆర్థిక మంత్రి ‘జహావి’ మద్ధతు
యుకె పీఎం రేసులో రిషి సునక్ కు ఇబ్బంది
Nadhim Zahawi : నిన్నటి దాకా వాళ్లిద్దరూ స్నేహితులు. అంతే కాదు యూకే కేబినెట్ లో సహచరులు. కానీ ఇప్పుడు బద్ద శత్రువులై పోయారు. ఇద్దరూ దాయాది దేశాలకు చెందిన వారు.
వారెవరో కాదు ఒకర భారతీయ మూలాలు కలిగిన రిషి సునక్. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి, సుధా మూర్తి లకు స్వయాన అల్లుడు.
ఇక పాకిస్తాన్ మూలాలు కలిగి ఉన్న వ్యక్తి నదీమ్ జహావి. ప్రస్తుతం యుకె ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నదీమ్ జహావి(Nadhim Zahawi). తాజాగా బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి రేసులో ఇద్దరు మిగిలారు.
ఒకరు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న లిస్ ట్రస్ . మరొకరు ఆర్థిక మంత్రిగా ఉన్న రిషి సునక్ మధ్య నువ్వా నేనా పోటీ నెలకొంది. నాలుగు రౌండ్లలో టాప్ లో నిలిచారు రిషి.
కానీ రోజు రోజుకు ప్రచారంలో లిజ్ ట్రస్ కు మద్దతు పెరుగుతోంది. తాజాగా మంత్రి నదీమ్ జహావి స్పందించారు.
విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ మారిన ఆర్థిక సనాతన ధర్మాన్ని తారుమారు చేసి మన ఆర్థిక వ్యవస్థను సంప్రదాయవాద మార్గంలో నడుపుతారని ఆశా భావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ట్రస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంతకు ముందు బ్రిటిష్ డిఫెన్స్ సెక్రటరీ కూడా లిజ్ ట్రస్ కు సపోర్ట్ ప్రకటించారు.
ఇదిలా ఉండగా నదీమ్ జహావి లిజ్ ట్రస్ తదుపరి కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలిగా అధికారికంగా ఆమోదించారని ది టెలిగ్రాఫ్ నివేదించింది.
Also Read : తగులబెట్టి ఇంటికి వెళ్లమంటే ఎలా