Fire Bhopal Delhi Vandebharat : వందే భారత్ కోచ్ లో ఉ 6గం మంటలు
తప్పిన పెను ప్రమాదం
Fire Bhopal Delhi Vandebharat : రైల్వే శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రైళ్లు పదే పదే ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పుడు రైలు ప్రయాణం అంటేనే జడుసుకునే పరిస్థితి నెలకొంది. సోమవారం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం నుంచి బయట పడింది. రైలు కోచ్ లో మంటలు చెలరేగాయి. అగ్ని మాపక సిబ్బంది తక్షణమే స్పందించారు. దీంతో కోచ్ లో చెలరేగిన మంటలను సకాలంలో ఆర్పగలిగారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ భోపాల్ నుంచి ఢిల్లీ కి వెళుతుండగా ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఉదయం 5.40 గంటలకు మధ్య ప్రదేశ్ లోని భోపాల్ నుంచి బయలుదేరి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కు మధ్యాహ్నం 1.10 గంటలకు చేరుకోవాల్సి ఉంది.
కాగా ట్రైన్ భోపాల్ నుంచి బయలు దేరింది. కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్ కు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా వందే భారత్ ట్రైన్ కోచ్ లోని బాక్స్ లో మంటలు చెలరేగాయి(Fire Bhopal Delhi Vandebharat). దీంతో కేథోరా స్టేషన్ లోనే వందే భారత్ ను నిలిపి వేశారు రైల్వే అధికారులు. అగ్ని మాపక దళానికి ఫోన్ చేయడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పి వేయడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : Daggubati Purandeswari : కేంద్రం నిధులతో జగన్ ప్రచారం