Imran Khan Shooter : తప్పుదోవ పట్టిస్తున్నందుకే కాల్చా – ఫైజల్
ఇమ్రాన్ ఖాన్ పై దాడికి పాల్పడ్డా
Imran Khan Shooter : పీటీఐ చైర్మన్, పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై దాడికి పాల్పడిన ఫైజల్ భట్(Imran Khan Shooter) సంచలన కామెంట్స్ చేశాడు. లాంగ్ మార్చ్ లో భాగంగా ప్రసంగిస్తున్న సమయంలో కాల్పులకు తెగబడ్డాడు భట్. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇమ్రాన్ ఖాన్ కుడి కాలి లో బుల్లెట్ దూసుకు పోయింది. ప్రమాదవశాత్తు ప్రాణాల నుంచి బయట పడ్డారు. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పులకు పాల్పడిన ఫైజల్ భట్ ను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ప్రస్తుతం వారి అదుపులో ఉన్న భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకే తాను కాల్పులకు పాల్పడినట్లు చెప్పాడు ఫైజల్ భట్. తాను తట్టుకోలేక ఇలాంటి ఘటనకు పాల్పడాల్సి వచ్చిందని చెప్పాడు. వజీరాబాద్ లోని జాఫర్ అలీఖాన్ చౌక్ వద్ద జరిగిన ఆజాద్ ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వెంటనే భట్ ను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. తాను నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు ఫైజల్ భట్. గత కొంత కాలంగా ఇమ్రాన్ ఖాన్ ద్వేష పూరిత ప్రసంగాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన ఎవరిని ఉద్దరించేందుకు చేస్తున్నాడో చెప్పడం లేదు.
నీతులు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతుండడంతో తాను తట్టుకోలేక పోయానని పేర్కొన్నాడు ఫైజల్ భట్. అందుకే కాల్చా. తనకు ఇమ్రాన్ ఖాన్ మాత్రమే శత్రువని కానీ మిగతా నాయకులు ఎవరూ తనకు టార్గెట్ కాదని స్పష్టం చేశాడు.
Also Read : ఎంత కాలం ఈ హింసోన్మాదం