MCD Transgender Win : ఎంసీడీ ఎన్నిక‌ల్లో ట్రాన్స్ జెండ‌ర్ రికార్డ్

మొద‌టి ట్రాన్స్ జెండ‌ర్ గా రికార్డ్

MCD Transgender Win : ఢిల్లీ న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. అర‌వింద్ కేజ్రీవాల్ సార‌థ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. మొత్తం 250 వార్డులకు గాను 1,300 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. మేయ‌ర్ ప‌ద‌వి కావాలంటే క‌నీసం 125 స‌భ్యులు కావాల్సి ఉండగా ఆప్ 134 సీట్లు గెలుచుకుంది.

గ‌త 15 ఏళ్లుగా కంటిన్యూగా ప‌వ‌ర్ లో ఉన్న బీజేపీకి చెక్ పెట్టింది ఆప్. తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 104 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీకి 9 సీట్లు వ‌చ్చాయి. ఢిల్లీ న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో ట్రాన్స్ జెండ‌ర్ విజ‌యం సాధించ‌డం (MCD Transgender Win) విశేషం. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బోబీ విజ‌యం సాధించారు.

ఏకంగా కాంగ్రెస్ అభ్య‌ర్థి వ‌రుణ ఢాకాను ఏకంగా 6, 714 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్ర‌త్య‌ర్థి పార్టీ అభ్య‌ర్థుల‌ను విస్తు పోయేలా చేశారు. ఇదిలా ఉండ‌గా ట్రాన్స్ జెండ‌ర్ గా ఉన్న బోబీ 2017 లో జ‌రిగిన పౌర సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేశారు. ట్రాన్స్ జెండ‌ర్ల సంఘం నుంచి తొలి స‌భ్యుడిగా గెలుపొందారు.

ఢిల్లీ లోని సుల్తాన్ పురి – ఎ వార్డులో విజ‌యం సాధించారు. పౌర సంస్థ‌కు ఎన్నికైన లింగ మార్పిడి సంఘంలో మొద‌టి సభ్యుడిగా నిలిచారు. ఈ సంద‌ర్బంగా బోబి మాట్లాడారు. త‌న కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన కార్య‌క‌ర్త‌ల‌కు, ఓట్లు వేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఈ విజ‌యం ప్ర‌జ‌ల‌కు అంకితం చేస్తున్న‌ట్లు చెప్పారు. ఈ ప్రాంతం అభివృద్ది కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

Also Read : ఢిల్లీ ఫ‌లితాలు గుజ‌రాత్ లో రిపీట్ – మాన్

Leave A Reply

Your Email Id will not be published!