CJI DY Chandrachud : కేసుల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలి
జడ్జీలు సమర్థవంతంగా పని చేయాలి
CJI DY Chandrachud : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై చంద్రచూడ్(CJI DY Chandrachud) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీజేఐగా కొలువు తీరిన తర్వాత మొదటిసారిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శించారు. అంతకు ముందు విజయవాడలో కొలువు తీరిన కనకదుర్గ ఆలయాన్ని సందర్శించారు.
ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ జ్యుడీషియల్ అకాడెమీని ప్రారంభించి ప్రసంగించారు జస్టిస్ డీవై చంద్రచూడ్. దేశంలో ఇప్పటి వరకు 6 కోట్లకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. సాధ్యమైనంత మేర యుద్ద ప్రాతిపదికన కేసులను పరిష్కరించేందుకు ఫోకస్ పెడుతున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా బెంచ్ లలో కూడా మార్పులు తీసుకు వచ్చామని స్పష్టం చేశారు. కేసుల పరిష్కారంలో జడ్జీలు, న్యాయమూర్తులు ఫోకస్ పెట్టాలని సూచించారు సీజేఐ(CJI DY Chandrachud). ఆంగ్లేయుల కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న వలసవాద మనస్తత్వం నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు.
ఇక నుంచి జిల్లా కోర్టులను సబార్డినేట్ జ్యుడీషియరీగా పేర్కొనడం మానుకోవాలని అన్నారు డీవై చంద్రచూడ్. అయితే న్యాయ వ్యవస్థ ప్రక్రియలో జిల్లా కోర్టులు ముఖ్య భూమిక పోషిస్తాయని చెప్పారు. ఇక ఈ వ్యవస్థలో బెయిల్ కే అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు సీజేఐ. అండర్ ట్రయల్స్ ఖైదీల సంఖ్య తగ్గడం లేదని ..ఇది వ్యక్తుల స్వేచ్ఛను కోల్పోవడమేనని పేర్కొన్నారు.
కన్విక్షన్ రేటు ఆధారంగా జడ్జీల పనితీరును విశ్లేషించడం గత కొంత కాలంగా వస్తూ ఉన్నదని, దానిని ఆపేయాలని ఇప్పటికే ఆదేశించడం జరిగిందని స్పష్టం చేశారు సీజేఐ డీవై చంద్రచూడ్.
Also Read : జగన్ పాలనలో బీసీలకు అన్యాయం