Priyank Kharge : 5 నిమిషాల యాడ్ కోసం రూ. 4.5 కోట్లు – ఖ‌ర్గే

క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ ఖ‌ర్చుపై ఆగ్ర‌హం

Priyank Kharge : క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. ప్ర‌భుత్వం కేవ‌లం 5 నిమిషాల యాడ్ కోసం ఏకంగా రూ. 4.5 కోట్లు ఖ‌ర్చు చేయ‌డంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. క‌మీష‌న్, క‌రప్ష‌న్ కు ప్ర‌స్తుతం కేరాఫ్ గా మారింద‌ని ఆరోపించింది. ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తూ వ‌స్తున్నారు ఆ పార్టీకి చెందిన అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ.

రాష్ట్రంలో ఓ వైపు నిరుద్యోగుల‌కు జాబ్స్ ఇవ్వ‌డంలో విఫ‌ల‌మైన ప్ర‌భుత్వం త‌న ప్ర‌చారం కోసం ప్ర‌భుత్వానికి చెందిన డ‌బ్బుల‌ను ఎలా ఖ‌ర్చు చేస్తుందంటూ మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖ‌ర్గే ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మైన ప్ర‌భుత్వం ప్ర‌మోష‌న్ల కోసం విప‌రీతంగా ఖ‌ర్చు చేస్తోందంటూ ఆరోపించారు.

బెంగ‌ళూరులో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ మీట్ (జీఐఎం)ని ప్ర‌మోట్ చేసేందుకు 5 నిమిషాల యాడ్ ఫిల్మ్ కోసం నాలుగున్న‌ర కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఇప్ప‌టికే అవినీతి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా మారింద‌ని మండిప‌డ్డారు ప్రియాంక్ ఖ‌ర్గే (Priyank Kharge) .

క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ క‌మ్యూనికేష‌న్స్ చైర్మ‌న్ అయిన ఖ‌ర్గే ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. దీనిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ప్ర‌జా ధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్న క‌ర్ణాట‌క స‌ర్కార్ నిర్వాకానికి ఈ యాడ్ ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు.

ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించేందుకు ప్ర‌చారాన్ని న‌మ్ముకుందంటూ మండిప‌డ్డారు. ఈ మొత్తం వ్యవ‌హారంపై, ప్ర‌భుత్వ ఖ‌ర్చుపై విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.

Also Read : కేర‌ళ‌లో సీఎం..గ‌వ‌ర్న‌ర్ పంచాయ‌తీ

Leave A Reply

Your Email Id will not be published!