Aditya Thackeray : షిండే ప్రభుత్వం కూలడం ఖాయం
అప్రజాస్వామికమన్న ఆదిత్యా ఠాక్రే
Aditya Thackeray : వెన్నుపోటు పొడిచి ఏర్పాటైన ప్రస్తుత ప్రభుత్వం త్వరలోనే కుప్ప కూలడం ఖాయమన్నారు శివసేన యువ నాయకుడు , మాజీ సీఎం తనయుడు ఆదిత్యా ఠాక్రే. ఈ సర్కార్ పూర్తిగా రాజ్యాంగ విరుద్దమైనదని, చట్ట విరుద్దమన్నారు.
స్వంత ప్రయోజనాల కోసం ఏర్పాటైన ఈ సర్కార్ ను ప్రజలు తిప్పి కొట్టడం ఖాయమన్నారు. షిండే వర్గం చేసింది నమ్మక ద్రోహమని పేర్కొన్నారు. మరాఠా ప్రజలు షిండే చేసిన మోసాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని చెప్పారు.
వైజా పూర్ , ఖుల్తాబాద్ , ఎల్లోరాలను సందర్శించిన సందర్శించారు. ప్రభుత్వం పడి పోయిన వెంటనే ఆదిత్యా ఠాక్రే జనంలోకి వెళ్లారు. శివ సంవద్ యాత్ర పేరుతో పర్యటిస్తున్నారు. ఔరంగాబాద్ లో ఆదిత్యా ఠాక్రే(Aditya Thackeray) మాట్లాడారు.
గత ఏడాది దీపావళి సమయంలో ఆనాటి సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆపరేషన్ కోసం ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే ఈ కుట్ర ప్రారంభమైందని మండిపడ్డారు.
షిండే వర్గం చేసింది మానవత్వానికి పూర్తిగా విరుద్దమన్నారు. కొత్త ప్రభుత్వం ఔరంగాబాద్ పేరును సంభాజీ నగర్ గా మార్చే ప్రక్రియను నిలిపి వేసి మళ్లీ జారీ చేయడం చిన్న పిల్లల నిర్ణయంగా అభివర్ణించారు.
మాతోశ్రీ తలుపులు విడిచి పెట్టిన వారి కోసం ఎల్లప్పటికీ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు ఆదిత్యా ఠాక్రే(Aditya Thackeray) . మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని గద్దె దించడం చేత కాక భారతీయ జనతా పార్టీ షిండేపై పట్టు సాధించి కూల్చిందని ఆరోపించారు.
ఔరంగాబాద్ ప్రాంతంలో అభివృద్ది పనుల కోసం ఎంవీఏ సర్కార్ రూ. 2,600 కోట్లు ఖర్చు చేసిందన్నారు ఎమ్మెల్సీ అంబాదాస్ దాన్వే.
Also Read : ఈసీకి చేరిన శివసేన పంచాయతీ