Khalid Payenda : కారు డ్రైవ‌ర్ గా మారిన ఆఫ్గాన్ మాజీ మంత్రి

మారిన ప‌రిస్థితుల‌కు అద్దం ప‌ట్టిన క‌థ

Khalid Payenda  : ఆయ‌న ఒక‌ప్పుడు ఆఫ్గ‌నిస్తాన్ కు ఆర్థిక మంత్రి. త‌న దేశం త‌ర‌పున బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు. కానీ తాలిబ‌న్లు దేశాన్ని కైవ‌సం చేసుకోవ‌డంతో ప్ర‌స్తుతం బ‌తుకు దెరువు కోసం అమెరికాలోని వాషింగ్ట‌న్ డీసీలో ఉబెర్ క్యాబ్ డ్రైవ‌ర్ గా ప‌ని చేస్తున్నారు.

వ‌చ్చే డ‌బ్బుల‌తో కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఖ‌లీద్ ప‌యెండా(Khalid Payenda ). దేశం విడిచి పారి పోవ‌డానికి ముందు ఆఫ్గ‌న్ కు మంత్రిగా (As Minister for Afghanistan) ప‌ని చేశారు. ఒక‌ప్పుడు ఆర్థిక మంత్రిగా 6 బిలియ‌న్ల డాల‌ర్ల బ‌డ్జెట‌న్ ప్ర‌వేశ పెట్టారు.

ప్ర‌స్తుతం గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో త‌న కుటుంబంతో స‌హా పారి పోయి వ‌చ్చాడు వాషింగ్ట‌న్ డీసీకి. ఆరు గంట‌లు ప‌ని చేస్తున్నాన‌ని 150 డాల‌ర్ల‌కు పైగా సంపాదిస్తున్నాని చెప్పాడు.

ఈ సంద‌ర్భంగా త‌న ఆవేద‌నను వ్య‌క్తం చేశాడు. ఆఫ్గ‌నిస్తాన్ ప్ర‌స్తుతం ఆర్థిక‌, మాన‌వ‌తా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంద‌ని వాపోయాడు. అమెరికా మ‌ద్ద‌తుతో ఉన్న ప్ర‌భుత్వాన్ని ప‌డగొట్టిన తాలిబ‌న్ స‌ర్కార్ ను గుర్తించేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాలు వెనుక‌డుగు వేస్తున్నాయి

. పీఎం ఘ‌నీతో (With PM Ghani)  సంబంధాలు తెగి పోవ‌డ‌తో తాలిబ‌న్లు రాజ‌ధాని న‌గ‌రాన్ని త‌మ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు వారం రోజుల ముందు ప‌యెండా దేశ ఆర్థిక మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు.

గ‌త ఏడాది ఆగ‌స్టు 10న ట్వీట్ చేశాడు. తాను తాత్కాలిక ఆర్థిక మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశాన‌ని తెలిపాడు. ఉన్న‌త ప‌ద‌విని చేప‌ట్టినందుకు గ‌ర్వంగా ఉంద‌ని పేర్కొన్నాడు.

ఆఫ్గ‌నిస్తాన్ లో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితికి అమెరికానే కార‌ణ‌మ‌ని ఆరోపించాడు. ఎంతో కాలంగా నిర్మిస్తూ వ‌చ్చిన పొద‌రిల్లు కూలి పోయిందంటూ ప్ర‌పంచ బ్యాంకుకు లేఖ రాయ‌డం సంచ‌ల‌నం క‌లిగించింది.

Also Read : ద‌లైలామా రెండేళ్ల అజ్ఞాతం ఎందుక‌ట‌?

Leave A Reply

Your Email Id will not be published!