Mehbooba Mufti : మాజీ సీఎం గృహ నిర్బంధం

మెహ‌బూబా ముఫ్తీ ఆరోప‌ణ

Mehbooba Mufti : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా జ‌మ్మూ కాశ్మీర్ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ త‌రుణంలో ఆయ‌న టూర్ ను అడ్డం పెట్టుకుని త‌న‌ను గృహ నిర్బంధం చేశారంటూ జ‌మ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహ‌బూబా ముఫ్తీ(Mehbooba Mufti) ఆరోపించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న ఇంటికి తాళాలు వేసిన ఫోటోల‌ను షేర్ చేశారు.

ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. తాము ఎలాంటి దేశ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ‌డం లేద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వంలో కొలువు తీరిన మోదీ సంకీర్ణ స‌ర్కార్ కావాల‌ని బీజేపీయేత‌ర సంస్థ‌లు, వ్య‌క్తులు, నాయ‌కుల‌ను టార్గెట్ చేస్తోంద‌ని ఆరోపించారు.

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తూ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నారంటూ మండిప‌డింది. విచిత్రం ఏమిటంటే ప్ర‌తి ఒక్క‌రికీ, నాయ‌కుడికి , పార్టీకి స్వేచ్ఛ‌గా ప్ర‌చారం చేసుకునే హ‌క్కు ఉంటుంద‌న్నారు మెహ‌బూబా ముఫ్తీ(Mehbooba Mufti). కేంద్ర హోం శాఖ టూర్ సంద‌ర్భంగా త‌న‌ను హౌజ్ అరెస్ట్ చేయ‌డం అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు.

త‌న ఇంటికి బ‌య‌టి నుంచి తాళం పెట్టారంటూ మండిప‌డ్డారు మాజీ సీఎం. తాను రాష్ట్రానికి సంబంధించి మాజీ ముఖ్య‌మంత్రిన‌న్న విష‌యం కూడా మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. బీజేపీ అరాచ‌క పాల‌న‌కు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు మెహ‌బూబా ముఫ్తీ.

భార‌త రాజ్యాంగం ద్వారా సంక్ర‌మించిన త‌న ప్రాథ‌మిక హ‌క్కుల‌కు భంగం వాటిల్లింద‌న్నారు. త‌న పార్టీకి చెందిన కార్య‌క‌ర్త పెండ్లికి వెళ్లేందుకు బ‌య‌లు దేరితే అడ్డుకున్నార‌ని ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా ముఫ్తీ చేసిన పోస్ట్ వైర‌ల్ గా మార‌డంతో జ‌మ్మూ కాశ్మీర్ పోలీసులు స్పందించారు. ముఫ్తీ చేసిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు.

Also Read : ఉగ్ర‌వాదాన్ని స‌హించే ప్ర‌స‌క్తి లేదు – అమిత్ షా

Leave A Reply

Your Email Id will not be published!