Siddaramaiah : కాంగ్రెస్ ను వీడనున్న మాజీ సీఎం ?
కమలం గూటికి సిద్దరామయ్య
Siddaramaiah : కన్నడ నాట కాంగ్రెస్ కు భారీ షాక్ తగలనుందా. అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా పేరొందారు సిద్దరామయ్య(Siddaramaiah). ప్రస్తుతం ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్ చీఫ్ గా ఉన్నారు.
ఈ సమయంలో మాజీ సీఎంగా ఉన్న సిద్దరామయ్య త్వరలో పార్టీని వీడనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక రాష్ట్రంలో అత్యధికంగా లింగాయత్ లు ఉన్నారు.
వారి సామాజిక వర్గమే గత కొన్ని తరాల నుంచి ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. ఎందుకంటే మొత్తం అసెంబ్లీ స్థానాలలో 75 శాతం స్థానాలను ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే అభ్యర్థుల జయాపజయాలను నిర్దేశిస్తారు.
అందుకే అన్ని పార్టీలు లింగాయత్ ల జపం చేస్తున్నాయి. కనీసం 150 స్థానాలలో పూర్తి ప్రభావం చూపడం విశేషం. ఇందులో 90 నియోజకవర్గాలను వారే నిర్ణయిస్తారు. దీంతో మరోసారి పవర్ లోకి రావాలని భారతీయ జనతా పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది.
ప్రధాన రాజకీయ నాయకులను తమ పార్టీ వైపు చూసేలా, చేరేలా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇటీవలే కేంద్ర హోం మంత్రి, ట్రబుల్ షూటర్ అమిత్ షా వచ్చి వెళ్లడంతో ఈ ప్రచారానికి మరింత ఊతం ఇచ్చినట్లయింది.
ఇందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్దరామయ్యను(Siddaramaiah) పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికినట్లు ప్రచారం ఊపందుకు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన వర్గానికి 20 సీట్లు కావాలని కోరినట్లు టాక్.
విచిత్రం ఏమిటంటే ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో సిద్దరామయ్య(Siddaramaiah) అనుచరులు 15 మందికి పైగా ఉండడంతో ఆయన కమలం గూటికి చేరడం ఖాయమని తోస్తోంది. ఆయన చేరిక లాంఛనమేనని బీజేపీ మంత్రి మనిరత్న ప్రకటించారు.
Also Read : తజిందర్ బగ్గాను అరెస్ట్ చేయొద్దు