Oommen Chandy : బెంగళూరు ఆస్పత్రికి మాజీ సీఎం
ఉమెన్ చాందీకి అయ్యే ఖర్చు పార్టీదే
Oommen Chandy : తీవ్ర అనారోగ్యం కారణంగా కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీని అత్యవసరంగా బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. 79 ఏళ్ల ఊమెన్ చాందీ బెంగళూరుకు వెళుతుండగా తన కుటుంబ సభ్యుల వల్ల తనకు చికిత్స ఆలస్యమైందని మీడియాలో వచ్చిన వార్తలను ఊమెన్ చాందీ ఖండించారు. ఇదిలా ఉండగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ సీఎం ఊమెన్ చాందీని(Oommen Chandy) పార్టీ ఏర్పాటు చేసిన చార్టర్డ్ విమానంలో ఆదివారం బెంగళూరులోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబీకులు వెల్లడించారు.
అలాంటి నివేదికలు ఎలా వెలువడ్డాయో నాకు తెలియదు. వారు నన్ను నా కుటుంబ సభ్యులను బాధ పెట్టారంటూ వాపోయారు మాజీ సీఎం ఊమెన్ చాందీ. ఆయన కుటుంబ సభ్యులతో పాటు వైద్య బృందం , కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు (ఎంపీ) బెన్నీ బెహనాన్ బెంగళూరు ఆస్పత్రికి మాజీ సీఎంతో పాటు వచ్చారు.
ఊమెన్ చాందీకి ఉత్తమ చికిత్స అందించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ సోదరుడు, బంధువులు కేరళ సీఎం పినరయి విజయన్ కు లేఖ రాశారు. ఇది వివాదానికి దారి తీసింది. కేన్సర్ కు చికిత్స చేయడం ఆలస్యం అవుతోందని , కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించడం లేదని ఆరోపించారు.
ఈ సమయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని నెయ్యటింకర లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించి మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. ఊమెన్ చాందీకి 2019 నుండి ఆరోగ్యం బాగా లేదు(Oommen Chandy) . గొంతు వ్యాధితో బాధ పడుతున్నారు. కొన్ని నెలల కిందట జర్మనీకి తీసుకు వెళ్లారు. న్యూమోనియా నుంచి కోలుకున్న తర్వాత బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. కాగా ఆయన వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తుందని పార్టీ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
Also Read : పవర్ లోకి వస్తే ప్రజా పాలన – ఖర్గే