Free Bus Scheme : బస్సులు ఫుల్ మహిళలు ఖుష్
ఒక్క రోజే అర కోటికి పైగానే ప్రయాణం
Free Bus Scheme : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ(Congress) ప్రభుత్వం ఖుష్ కబర్ చెప్పింది. ఇందులో భాగంగా తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండింటిని అమలు చేసింది. వీటిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది.
Free Bus Scheme Updates in Telangana
పల్లె వెలుగు , ఎక్స్ ప్రెస్ బస్ సర్వీస్ లతో పాటు హైదరాబాద్ లాంటి నగరాలలో తిరిగే సిటీ బస్ సర్వీస్ లలో కూడా అదనపు సౌకర్యం కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎంతో పాటు ఇతర మంత్రులు జెండాలు ఊపి ప్రారంభించారు. దీనికి మహాలక్ష్మి అని పేరు పెట్టారు.
ఫ్రీ బస్ సర్వీస్ దెబ్బకు టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే బస్సులు మహిళా ప్రయాణీకులతో కిట కిట లాడుతున్నాయి. నిన్నటి దాకా ప్రయాణీకుల కోసం గొంతు చించుకుని అరిచే వాళ్లు కండక్టర్లు, డ్రైవర్లు. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది తప్పింది. ప్రస్తుతం మహిళలు పోటెత్తడంతో బస్సులు సరి పోవడం లేదని సమాచారం.
ప్రారంభించిన తర్వాత ఏకంగా ఒక్క రోజే అర కోటి మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసినట్లు స్పష్టం చేశారు ఎండీ వీసీ సజ్జనార్. ఈ స్కీం డిసెంబర్ 9 నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ అరకోటి మంది ప్రయాణం చేయడం వల్ల ఆర్టీసీకి రూ. 6 కోట్ల దాకా నష్టం వచ్చిందని అయితే వీటిని ప్రభుత్వం రీ అంబర్స్ మెంట్ చేస్తుందని చెప్పారు ఎండీ. రాబోయే రోజుల్లో మరికొన్ని కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు.
Also Read : Rahul Priyanka Gandhi : అమరావతి సభకు అన్నా చెల్లెలు