APSSDC : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇక నుంచి ఏదైనా కోర్సు చేయాలంటే డబ్బులు కట్టాలన్న బెంగ తప్పనుంది. తమ ప్రతిభా పాటవాలను పెంచుకునేందుకు చక్కని అవకాశం కల్పిస్తోంది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి. ఆ మేరకు శుభవార్త చెప్పింది. హయ్యర్ ఎడ్యూకేషన్ కు సంబంధించి ఆన్ లైన్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు మండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి తెలిపారు. ఏఐసీటిఈ, నాస్కామ్‌ల భాగస్వామ్యంతో ఈ కోర్సులు నిర్వహిస్తామన్నారు.
కోర్సు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన వారికి ఏఐసీటీఈ, నాస్కామ్ స్కిల్ కౌన్సిల్ సెక్టార్ సంయుక్తంగా సర్టిఫికెట్లను అందిస్తాయని వెల్లడించారు. నేర్చుకున్న సమయం ఆధారంగా క్రెడిట్లు కేటాయిస్తామన్నారు. ఈ కోర్సులు చదివేందుకు, నేర్చుకునేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఇంత చక్కటి అవకాశాన్ని విద్యార్థులు, అధ్యాపకులు నేర్చుకునేందుకు ముందుకు రావాలని కోరారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి పలు కోర్సులకు డిమాండ్ ఉంటోంది. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, బిగ్ డేటా అనాలసిస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తో పాటు వ్యాపార నైపుణ్యాలను పెంచే ప్రాబ్లమ్ సాల్వింగ్, డిజైన్ థింకింగ్, ప్రాజెక్టు, ప్రొడక్ట్ ప్రోగ్రామ్ మేనేజమ్మెంట్, డిజిటల్ లీడర్ షిప్, కమ్యూనికేషన్ , స్టోరీ టెల్లింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, తదితర ప్రొఫెషనల్ కోర్సులను నేర్చుకునే వీలుంది విద్యార్థులకు. అధికారిక వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి కోరారు.
No comment allowed please