Free Rice 5kgs Telangana : ఉచిత బియ్యం పథకం పొడిగింపు
ప్రకటించిన తెలంగాణ సర్కార్
Free Rice 5kgs Telangana : తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి మేలు చేకూర్చేలా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఉచితంగా 5 కిలోల బియ్యాన్ని(Free Rice 5kgs Telangana) ఇవ్వనుంది. దీని వల్ల రాష్ట్రంలోని 1.91 కోట్ల మందికి లబ్ది చేకూరనుంది. ఇందులో 17.6 మిలియన్ల మంది ఎన్ఎఫ్ఎస్ కార్డుదారులు ఉన్నారు.
1,55,500 అంత్యోదయ అన్న యోజన కార్డు హోల్డర్లు ఉన్నారు. ఇదిలా ఉండగా ఉచిత బియ్యం పథకాన్ని కేంద్రం పొడిగించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉచిత బియ్యం పథకం ఈనెల జనవరి నుంచి ప్రారంభిస్తోంది. ఈ కార్యక్రమం వచ్చే ఏడాది 2024 దాకా కొనసాగుతుందని సర్కార్ పేర్కొంది.
దీని వల్ల దారిద్ర రేఖకు దిగువన ఉన్న 9.1 మిలియన్లకు పైగా ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 5 కిలోల బియ్యం ఉచితంగా అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాల్టి నుంచి ఉచిత బియ్యం సరఫరా అవుతోంది.
ఇక కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ దాకా ఉచిత బియ్యం పథకం(Free Rice 5kgs Telangana) కొనసాగుతుంది. కిలోకు రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి తీసుకునేది. కానీ ఇక నుంచి అది కూడా తీసుకోకూడదని నిర్ణయించింది.
పేదలు ఆకలితో ఉండకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ప్రభుత్వం. ఇదిలా ఉండగా ప్రభుత్వ నిర్ణయంపై లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : 26 నుంచి రేవంత్ పాదయాత్ర