Elon Musk : స్వేచ్ఛ మంచిదే కానీ చంపేలా ఉండ‌కూడ‌దు

ట్విట్ట‌ర్ బాస్ ఎలాన్ మ‌స్క్ షాకింగ్ కామెంట్స్

Elon Musk : తాను ప్ర‌మాదంలో ఉన్నాన‌ని ఆవేద‌న‌టెస్లా చైర్మ‌న్, ట్విట్ట‌ర్ బాస్ ఎలాన్ మ‌స్క్(Elon Musk) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను హ‌త్య‌కు గుర‌య్యే చాలా ముఖ్య‌మైన ప్ర‌మాదాన్ని ఎదుర్కొంటున్న‌ట్లు వాపోయాడు. మీరు నిజంగా వేరొక‌రికి హాని క‌లిగించ‌నంత కాలం మీరు కోరుకున్న‌ది చెప్పేందుకు మిమ్మ‌ల్ని అనుమ‌తించాలి అని పేర్కొన్నాడు. స్పేసెస్ తో మాట్లాడిన సంద‌ర్భంగా ఆయ‌న ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

అయితే ఒక్కోసారి షాకింగ్ కామెంట్స్ చేస్తూ విస్తు పోయేలా చేస్తారంటూ నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. నియంత్రిత ప్ర‌సంగం డిఫాల్ట్ .. అది స్వేచ్ఛా ప్ర‌సంగం కాద‌ని పేర్కొన్నాడు. రెండు గంట‌ల పాటు సాగింది ఆడియో చాట్. ఇందులో ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చాడు ఎలాన్ మ‌స్క్. నిజంగా టెక్నాల‌జీ మారింది.

విచిత్రం ఏమిటంటే గ‌తంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడున్న సాంకేతిక యుగంలో చంప‌డం చాలా ఈజీ అని కుండ బ‌ద్ద‌లు కొట్టాడు ట్విట్ట‌ర్ బాస్(Elon Musk).

అయితే ఎవ‌రూ కూడా త‌న‌ను చంప‌ర‌నే అనుకుంటున్న‌ట్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌కలం రేపింది. విధి రాత‌ను ఎవ‌రూ మార్చ‌లేరు. దానిని దేవుడు కూడా త‌ప్పించు కోలేడు. అందుకే త‌నను ఎవ‌రూ చంప‌ర‌ని అనుకుంటున్న‌ట్లు పేర్కొన్నాడు.

అణ‌చి వేయ‌బ‌డని, ప్ర‌తీకారానికి భ‌య‌ప‌డ‌కుండా చెప్పే స్వేచ్ఛ‌ను ట్విట్ట‌ర్ క‌ల్పిస్తోంద‌న్నారు ఎలాన్ మ‌స్క్. అయితే స్వేచ్ఛ‌, స్వాతంత్రం ఉండ‌డం మంచిదే. కానీ దానిని దుర్వినియోగం చేయ‌కూడ‌దు. అది ఎవ‌రినీ చంపేలా ఉండ కూడ‌ద‌ని పేర్కొన్నారు.

Also Read : మాతాజీ పితాజీ 5జీ కంటే ఎక్కువ – అంబానీ

Leave A Reply

Your Email Id will not be published!