Mohammed Zubair : మహ్మద్ జుబైర్ పై కొత్తగా అభియోగాలు
జూన్ 27న ఢిల్లీ పోలీసులు అరెస్ట్
Mohammed Zubair : మత పరమైన మనో భావాలను దెబ్బ తీశారనే అభియోగాలతో గత నెల జూన్ 27న ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ ను అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా ఫ్యాక్ట్ చెకర్ జుబైర్ పై కొత్త అభియోగాలు మోపారు ఢిల్లీ పోలీసులు. ఎఫ్సీఆర్ఏ లేదా విదేశీ కాంట్రిబ్యూషన్ (నియంత్రణ ) చట్టం లోని సెక్షన్ 35తో పాటు వార్తా ఛార్జీలు నమోదు చేశారు.
2018లో అభ్యంతకరమైన ట్వీట్కు సంబంధించి జుబైర్ ను అరెస్ట్ చేశారు. పాటియాలా హౌస్ కోర్టులో ఫ్యాక్ట్ చెకర్ ను హాజరు పరిచారు. దీంతో కోర్టు నాలుగు రోజుల కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది.
తాజాగా జుబైర్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఎఫ్సీఆర్ఏ సెక్షన్ 35తో పాటు నేర పూరిత కుట్ర, సాక్ష్యాధారాలను నాశనం చేయడం వంటి అభియోగాలను చేర్చినట్లు ఢిల్లీ పోలీసులు పాటియాలా హౌస్ కోర్టుకు తెలిపారు.
ఇదిలా ఉండగా ఎఫ్ఐఆర్ లో నేర పూరిత కుట్ర జోడించడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పోలీసులు జుబైర్ కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోరారు.
మరో వైపు ఆల్ట్ న్యూస్ జర్నలిస్ట్ లాయర్ బెయిల్ పిటిషన్ ను కోర్టు ముందుంచారు. కాగా ఒక టీవీ షోలో మహ్మద్ ప్రవక్తపై సస్పెండ్ చేసిన బీజేపీ నేత నూపుర్ శర్మ చేసిన కామెంట్స్ వీడియోను ఫ్లాగ్ చేసిన కొద్ది రోజులకే ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్(Mohammed Zubair) ను అరెస్ట్ చేశారు.
మత పరమైన మనో భావాలను దెబ్బ తీసేలా ఉన్నాయంటూ ట్విట్టర్ యూజర్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Also Read : గౌహతి ఆఫర్ వచ్చినా వెళ్లలేదు – సంజయ్ రౌత్