Nancy Pelosi : యుద్ధం కంటే స్నేహం ముఖ్యం – నాన్సీ పెలోసీ
డ్రాగన్ చైనాకు అమెరికా స్పీకర్ హెచ్చరిక
Nancy Pelosi : తీవ్ర ఉద్రిక్తతలు, హెచ్చరికల మధ్య అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ భూభాగంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆమె పర్యటనను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది చైనా.
కాలు మోపితే యుద్ధానికి సిద్దమంటూ హెచ్చరించింది. తైవాన్ పై తమకు హక్కు ఉందని ఇందులో ఎవరు జోక్యం చేసుకున్నా చూస్తూ ఊరుకోమంటూ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా తైవాన్ మాత్రం డోంట్ కేర్ అంటోంది. డ్రాగన్ తో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమైంది. ఇదే సమయంలో అమెరికా బేషరతుగా తైవాన్ కు మద్దతు ఇస్తోంది.
అగ్ర దేశాల మధ్య నువ్వా నేనా అన్న యుద్దం మొదలైంది. చైనా హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ యుఎస్ స్పీకర్ నాన్సీ పెలోసీ(Nancy Pelosi) తైవాన్ లో పర్యటించారు.
దీంతో ముందస్తుగా ప్రకటించిన విధంగానే డ్రాగన్ కన్నెర్ర చేసింది. ఆమె ఉండగానే తైవాన్ భూ భాగంలోకి 21 ఫైటర్ జెట్ లను ప్రయోగించింది.
దీంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతల మధ్య స్పీకర్ నాన్సీ పెలోసీ మీడియాతో మాట్లాడారు.
ప్రపంచంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంటుందన్నారు. కాదని అనేందుకు హుకుం జారీ చేసేందుకు ఏ దేశానికి లేదని స్పష్టం చేశారు.
తాము యుద్దం చేసేందుకు ఇక్కడికి రాలేదని తైవాన్(Taiwan) తో స్నేహ సంబంధం కుదుర్చు కునేందుకు వచ్చానని చెప్పారు. ఇదిలా ఉండగా 25 ఏళ్ల తర్వాత తైవాన్ ను సందర్శించారు నాన్సీ పెలోసీ.
ఆసియా పర్యటనలో ఉన్న ఆమెకు బీజింగ్ లో అనూహ్యమైన సాదర స్వాగతం లభించింది.
Also Read : తైవాన్ లోకి చైనా ఫైటర్ జెట్ లు ఎంట్రీ