Mayawati : ఛాంద‌స‌వాద రాజ‌కీయం ప్ర‌మాదం

బీఎస్పీ చీఫ్ మాయావ‌తి కామెంట్స్

Mayawati : ఈ దేశంలో ఇంకా మ‌త‌మార్పిడులు చోటు చేసుకుంటుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌న్నారు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ చీఫ్ మాయ‌వతి. లౌకిక రాజ్యాంగం ప్ర‌కారం దేశంలోని అన్ని ఇత‌ర మ‌తాల ప్ర‌జ‌లు కూడా సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని కోరుకుంద‌ని తెలిపారు. కానీ ఇవాళ ఎక్క‌డ చూసినా కులం, మ‌తం, ప్రాంతం ఆధారంగా విద్వేషాల‌తో నిండి పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాయావ‌తి(Mayawati).

ప్ర‌తి ఒక్క‌రు వీట‌న్నింటిని త్య‌జించి మ‌నుషులంతా ఒక్క‌టిగా ఉండాల‌న్న‌దే త‌న కోరిక అని పేర్కొన్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆదివారం మాజీ సీఎం మాయావ‌తి క్రిస్మ‌స్ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. అన్ని మ‌తాల మ‌ధ్య శాంతి, సామ‌ర‌స్యం వెల్లి విరియాల‌ని కోరారు. దేశంలో మ‌తం పేరుతో జ‌రుగుతున్న రాజ‌కీయాలపై తీవ్రంగా మండిప‌డ్డారు.

ఇది కాదు దేశానికి కావాల్సింది అని పేర్కొన్నారు. ద్వేషం వ‌ల్ల ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకుంటాయ‌ని మ‌నుషుల మ‌ధ్య బంధాలు తెగి పోతాయ‌ని హెచ్చ‌రించారు. ఇవాళ ఎవ‌రిని చూసినా నీది ఏమ‌తం అనే స్థాయికి స‌భ్య స‌మాజం దిగ‌జారి పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కుమారి మాయావ‌తి.

మ‌త మార్పిడికి సంబంధించి దేశ‌మంత‌టా గంద‌ర‌గోళం సృష్టించ‌డం అన్యాయం. ఆందోళ‌న‌క‌రం కూడా. బ‌ల‌వంతంగా చేసేది ఎప్ప‌టికీ నిల‌వ‌ద‌న్నారు. చెడు ఉద్దేశంతో మ‌తం మార్చుకోవడం త‌ప్పేన‌ని పేర్కొన్నారు మాయావ‌తి(Mayawati). స‌రైన కోణంలో చూసి అర్థం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఛాంద‌స‌వాద రాజ‌కీయాల వ‌ల్ల దేశానికి తీర‌ని న‌ష్టం వాటిల్లుతుంద‌ని హెచ్చ‌రించారు. క్రైస్త‌వ మ‌తాన్ని అనుస‌రించే వారంద‌రికీ నా అభినంద‌న‌లు అంటూ తెలిపారు.

Also Read : మంత్రి కౌశ‌ల్ కిషోర్ కంట‌త‌డి

Leave A Reply

Your Email Id will not be published!