RTC MD Sajjanar : ఆర్టీసీ భ‌విష్య‌త్తుకు ఢోకా లేదు – ఎండీ

అయితే యూనియ‌న్లు ఉండ‌వ‌ని ప్ర‌క‌ట‌న

RTC MD Sajjanar : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ స‌జ్జ‌నార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో న‌ష్టాల్లో ఉన్న ఆర్టీసీని మెల మెల్ల‌గా లాభాల బాట‌లోకి తీసుకు వ‌స్తున్నామ‌ని చెప్పారు. అయితే సంస్థ‌లో ఇక నుంచి యూనియ‌న్లు అంటూ ఉండ‌వ‌న్నారు. ప్ర‌స్తుతానికి కోలుకుంద‌ని, ఆర్టీసీ మ‌నుగ‌డ‌కు ఇబ్బంది లేద‌న్నారు.

సంస్థ బ‌లోపేతం కోసం సిబ్బంది, ఉద్యోగులు శ‌క్తి వంచ‌న లేకుండా ప‌ని చేస్తున్నార‌ని కితాబు ఇచ్చారు ఎండీ. కాగా ప్ర‌భుత్వం ఏనాడూ యూనియ‌న్లు ఏర్పాటు చేస్తామ‌ని చెప్ప‌లేద‌ని స్ప‌ష్టం చేశారు స‌జ్జ‌నార్(RTC MD Sajjanar).

క‌రోనా క‌ష్ట స‌మ‌యంలో ఆర్టీసీకి తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని, దాని నుంచి కోలుకునేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని ప్ర‌స్తుతం గాడిలో ప‌డింద‌న్నారు. వినూత్నంగా ఆలోచించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ప్ర‌వేశ పెట్టిన కార్గో స‌ర్వీసు కార‌ణంగా అద‌న‌పు ఆదాయం సంస్థ‌కు స‌మ‌కూరుతోంద‌ని వెల్ల‌డించారు ఎండీ.

ప్ర‌స్తుత సంవ‌త్స‌రం 2022 పూర్త‌వుతోంద‌ని రూ. 1900 కోట్లు న‌ష్టం రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డామ‌ని పేర్కొన్నారు. పండుగ వేళ‌ల్లో అద‌నంగా బ‌స్సులు న‌డుపుతున్నామ‌ని, అంతే కాకుండా స్పెష‌ల్ బ‌స్సులు వేశామ‌ని, అద‌న‌పు సౌకర్యాలు క‌ల్పించామ‌ని దీని వ‌ల్ల ఆదాయం వ‌స్తోంద‌న్నారు. ఒక్క రాఖీ పండుగ రోజే టీఎస్ ఆర్టీసీకి రూ. 20 కోట్ల ఆదాయం స‌మ‌కూరింద‌ని చెప్పారు ఎండీ స‌జ్జ‌నార్(RTC MD Sajjanar).

విద్యార్థులు ప‌డుతున్న ఇబ్బందులు త‌మ దృష్టికి వ‌చ్చాయ‌ని, వారిని ఇత‌ర బ‌స్సుల్లో ప్ర‌యాణం చేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. ఇక రాబోయే సంక్రాంతికి భారీ ఎత్తున బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని తెలిపారు. ఎలాంటి అద‌న‌పు ఛార్జీలు వ‌సూలు చేయ‌డం లేద‌న్నారు. త్వ‌ర‌లోనే డిజిట‌ల్ సేవ‌లను అమ‌లు చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు పేర్కొన్నారు స‌జ్జ‌నార్.

Also Read : పుస్త‌కాల్లో చ‌దివాం ఇప్పుడు చూస్తున్నాం

1 Comment
  1. Navya says

    Avunu nijamey students pass amount ekuva cheysaru ,metro lu ekuva vesaru ordinary buses thisesaru students ni ebhandi pedthunaru ndhuku avuthadhi Inka periguthadhi kani 😏

Leave A Reply

Your Email Id will not be published!