Omar Bin Sultan Al Olama : టెక్నాలజీలో భారతీయులదే హవా
ప్రశంసలు కురిపించిన యూఏఈ మంత్రి
Omar Bin Sultan Al Olama : ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచంలో టెక్నాలజీ పరంగా భారతీయులే టాప్ లో ఉంటారని వాళ్లు లేకుండా ఏదీ ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు యూఏఈ మంత్రి ఒమర్ బిన్ సుల్తాన్ అల్ ఒలామా(Omar Bin Sultan Al Olama) . భవిష్యత్ అంతా సాంకేతికానిదే. దానిని ఎవరూ కాదనలేరు. ఎందుకంటే టెక్నాలజీ వచ్చాక ప్రపంచం చిన్నదై పోయింది.
ఈ రంగంలో అత్యధిక భాగం నిపుణులైన భారతీయులకే దక్కనుందని జోష్యం చెప్పారు. ఒకరకంగా భారత దేశానికి ఆయన కితాబు ఇచ్చారు. ఈ సందర్బంగా టెక్నాలజీ పరంగా భారతీయ వేలి ముద్రలు ప్రతి చోటా ఉంటాయన్నారు ఒలామా. ఐ2యు2 అనేది భారత దేశం, ఇజ్రాయెల్ , యుఏఈ, యుఎస్ లను సూచిస్తుంది.
ఈ దేశాల భాగస్వామ్యం ఒక రకమైన రోల్ మోడల్ గా ఉంటుందన్నారు. అనేక దేశాలు తమ సహకారాన్ని నిర్మించ బోతున్నాయని యూఏఈ టెక్నాలజీ మినిష్టర్ తెలిపారు. ఇదిలా ఉండగా బుధవారం ఒమర్ బిన్ సుల్తాన్ అల్ ఒలామా(Omar Bin Sultan Al Olama) 25వ బెంగళూరు టెక్ సమ్మిట్ ప్రారంభ సెషన్ లో ప్రసంగించారు.
సాంకేతిక రంగంలో దేశం సాధించిన పురోగతిని ప్రశంసించారు. భారత దేశం గతం , వర్తమానం మాత్రమే కాదు. భారత దేశం భవిష్యత్తు కూడా అని మా నమ్మకమన్నారు. ప్రతి ఒక్కరికీ , ప్రతి చోటా భారతీయ వేలి ముద్ర తప్పక ఉంటుందన్నారు.
బెంగళూరు వంటి ప్రాంతాల నుండి టెక్నాలజీ నడుస్తోందని, కాగా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా సాంకేతికత వచ్చిందని చెప్పారు ఒలామా. ప్రపంచ వ్యాప్తంగా అత్యున్నతమైన టెక్నాలజీ సంస్థలలో ఎక్కువగా భారతీయులే ఉన్నారని అన్నారు.
Also Read : సీఎం కాళ్లు మొక్కిన విద్యా శాఖ డైరెక్టర్