G D Bakshi Agnipath : అగ్నిప‌థ్ స్కీం ఆర్మీకి తీవ్ర న‌ష్టం

రిటైర్డ్ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ జీడీ భక్షి

G D Bakshi Agnipath : కేంద్రం తీసుకు వ‌చ్చిన అగ్ని ప‌థ్ స్కీం అగ్నిగుండ‌గా మారింది. దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు మిన్నంటాయి. ఆందోళ‌న‌లతో అట్టుడుకుతోంది. ప‌లు చోట్ల విధ్వంసాలు కొన‌సాగుతూనే ఉన్నాయి.

ముందూ వెనుకా లేకుండా ప్ర‌క‌టించిన ఈ స్కీం ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. అగ్నిప‌థ్ స్కీం నిర‌స‌న‌లో భాగంగా ఆస్తుల విధ్వంసం కొన‌సాగూత‌నే ఉంది.

ఇప్ప‌టికే ముంద‌స్తు హెచ్చ‌రిక లేకుండా కాల్పులు జ‌ర‌ప‌డంతో వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన రాకేశ్ అనే యువ‌కుడు ప్రాణాలు కోల్పోయాడు.

తాజాగా అగ్నిప‌థ్ స్కీంపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు కార్గిల్ హీరోగా పేరొందిన రిటైర్డ్ మేజ‌న‌ర జ‌న‌ర‌ల్ జీడీ భ‌క్షి(G D Bakshi Agnipath). ఇది పూర్తిగా భార‌త ర‌క్ష‌ణ రంగానికి ఏ మాత్రం మేలు చేకూర్చ‌దంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఒక ర‌కంగా చెప్పాలంటే భార‌త ఆర్మీ వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా నాశ‌నం చేయ‌డం తప్ప మ‌రొక‌టి కాద‌న్నారు భ‌క్షి. దేశంలోని కీల‌క రంగాల‌లో ప్ర‌ధాన‌మైన‌ది,

మొద‌టిది ఆర్మీ రంగం. దీనిని షార్ట్ ట‌ర్మ్ గా మార్చాల‌ని అనుకోవ‌డం అంటే నిర్వీర్యం చేయ‌డ‌మేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆర్మీ రంగానికి ఇలాంటి దుందుడుకు నిర్ణ‌యాలు చెడు త‌ప్ప మంచి చేయ‌వ‌ని పేర్కొన్నారు భ‌క్షి.

ప‌థ‌కానికి సంబంధించి నాలుగేళ్ల‌న్నారు. ఆ త‌ర్వాత వాళ్లు ఎక్క‌డికి వెళ‌తారు. ఒక రంగానికి అల‌వాటైన వారు ఇత‌ర రంగాల‌లో ఇముడ‌లేరు. ప్ర‌త్యేకించి మిగ‌తా రంగాలకంటే ర‌క్ష‌ణ రంగం పూర్తిగా భిన్న‌మైన‌ద‌ని స్ప‌ష్టం చేశారు భ‌క్షి.

శిక్ష‌ణ ఇచ్చే సంద‌ర్భంలో ఈ రంగానికి సంబంధించిన ర‌హ‌స్యాలు బ‌య‌ట‌కు వెళ్లేందుకు ఆస్కారం ఎక్కువ‌గా ఉంద‌ని, వెంట‌నే మోదీ ప్ర‌భుత్వం అగ్నిపథ్ స్కీంను వెన‌క్కి తీసుకోవాల‌ని సూచించారు.

Also Read : అద్భుత ప‌థ‌కం అగ్నిప‌థ్ స్కీం

Leave A Reply

Your Email Id will not be published!