G kishan Reddy : హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ తెలంగాణ చీఫ్ జి. కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ రెండు చోట్ల ఓడి పోతున్నాడని జోష్యం చెప్పారు. ఇన్నాళ్ల పాటు మాయ మాటలతో ప్రజలను మోసం చేశారంటూ ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందన్నారు.
G kishan Reddy Comments on KCR
అయితే కాంగ్రెస్ పార్టీ బలుపు చూసి వాపు అనుకుంటోందని ఎద్దేవా చేశారు జి. కిషన్ రెడ్డి(G kishan Reddy). ఈసారి బీసీలు, ఎస్టీలు తమ వైపు ఉన్నారని తాము జరగబోయే ఎన్నికల్లో కింగ్ పిన్ గా మార బోతున్నామని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు.
బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు మూడు ఒక్కటేనని కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తి కలిగిస్తోంది. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఓడి పోతున్నాడని , అక్కడ తమ పార్టీ తరపున బరిలో నిలిచిన వెంకట రమణా రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తున్నాడని అన్నారు.
అంతే కాకుండా గజ్వేల్ లో పోటీకి దిగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తప్పకుండా విక్టరీ కావడం ఖాయమని పేర్కొన్నారు జి. కిషన్ రెడ్డి. ఇక ఈ ఎన్నికలే కేసీఆర్ కు చివరి ఎన్నికలంటూ ఎద్దేవా చేశారు . రాజ్యం, అధికారం ఎల్లకాలం ఉండవని తెలుసుకుంటే మంచిదని సూచించారు.
Also Read : Revanth Reddy : మామా అల్లుళ్ల వల్లనే రైతు బంధుకు బ్రేక్