G Kishan Reddy : ఐటీ దాడుల‌తో సంబంధం లేదు

బీజేపీ చీఫ్ జి. కిష‌న్ రెడ్డి కామెంట్

G Kishan Reddy : హైద‌రాబాద్ – ఎన్నిక‌ల నేప‌థ్యంలో హైద‌రాబాద్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేత‌లే టార్గెట్ గా ఐటీ దాడులు కొన‌సాగుతున్నాయి. దీంతో కేంద్రంలో కొలువు తీరిన మోదీ, బీజేపీ స‌ర్కార్ ప్రమేయం వ‌ల్ల‌నే జ‌రుగుతోందంటూ విప‌క్షాలు పెద్ద ఎత్తున మండి ప‌డుతున్నాయి.

G Kishan Reddy Comment on IT Raids

దీనిపై తీవ్రంగా స్పందించారు బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి(G Kishan Reddy). గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మీడియా చెప్పేంత దాకా త‌న‌కు ఐటీ దాడుల విష‌యం తెలియ‌ద‌న్నారు. ఐటీ సోదాల‌తో త‌మ స‌ర్కార్ కు, పార్టీకి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ సోదాలు కొత్త‌గా జ‌ర‌గ‌డం లేద‌ని, ఆ విష‌యం గుర్తించాల‌ని సూచించారు. గ‌తంలోనూ ప‌లుచోట్ల త‌నిఖీలు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు కిష‌న్ రెడ్డి. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ కు వ‌చ్చిన ఆయ‌న ఎయిర్ పోర్ట్ వ‌ద్ద మాట్లాడారు.

ఇవాళ మూడో జాబితా పార్టీ ప‌రంగా వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌లో వాస్త‌వం లేద‌న్నారు. ఇప్ప‌టికే అభ్య‌ర్థుల ఎంపిక‌కు సంబంధించి క‌స‌రత్తు పూర్త‌యింద‌ని చెప్పారు. అంద‌రికీ ఆమోద యోగ్యంగా ఉంటుంద‌న్నారు. పార్టీని వీడి పోయే వాళ్ల గురించి తాను ఏమీ మాట్లాడ బోన‌ని పేర్కొన్నారు.

Also Read : Revanth Reddy : కాళేశ్వ‌రం కాద‌ది స్కామేశ్వ‌రం

Leave A Reply

Your Email Id will not be published!