G Kishan Reddy : ప్లీజ్ బీజేపీకి మద్దతు ఇవ్వండి
తెలంగాణలో ఇవ్వాలన్న కిషన్ రెడ్డి
G Kishan Reddy : హైదరాబాద్ – తెలంగాణ భారతీయ జనతా పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి జనసేన పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలుసుకున్నారు. పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.
G Kishan Reddy Request
ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. దీంతో అన్ని పార్టీలు జూలు విదిల్చాయి. బీఆర్ఎస్ కదన రంగంలోకి ఎంటర్ అయ్యింది. ఆ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగా 119 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్.
ఇక ఎన్నికలకు సంబంధించి బీజేపీకి ఈసారి ఊహించని రీతిలో పెద్ద ఎత్తున టికెట్ల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 6,000 లకు పైగా వచ్చినట్లు బీజేపీ ప్రకటించింది. ఇప్పటి వరకు లిస్టును ఖరారు చేయలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తోంది బీజేపీ.
తాము తప్పకుండా ప్రభావితం చేస్తామని, కల్వకుంట్ల కుటుంబం అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిందని సభల్లో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు.
ఇప్పటి వరకు ఏ ఒక్కరినీ అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఇక పార్టీ పరంగా ఇప్పటి వరకు జోష్ మీదున్న బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డికి(G Kishan Reddy) ఛాన్స్ ఇచ్చారు. తీరా తెలంగాణలో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా పవన్ కళ్యాణ్ ను కోరడం విస్తు పోయేలా చేసింది.
Also Read : Kalpavruksha Vahanam : కల్పవృక్ష వాహనంపై శ్రీవారు