G Kishan Reddy : ఎస్డీఆర్ఎఫ్ అకౌంట్లో రూ. 900 కోట్లు
కేంద్రం వాటా 75 శాతం రాష్ట్ర వాటా 25 శాతం
G Kishan Reddy : కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన రాష్ట్ర సర్కార్ ను టార్గెట్ చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్ అకౌంట్లో రూ. 900 కోట్ల నిధులు ఉన్నాయని స్పష్టం చేశారు. కేంద్ర సర్కార్ కు సంబంధించి ఇందులో 75 శాతం ఉంటే రాష్ట్రానికి సంబంధించి 25 శాతంగా నిధులు ఉన్నాయని వెల్లడించారు.
G Kishan Reddy Comments
ఈ నిధులను ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలలో వినియోగించాలని సూచించారు గంగాపురం కిషన్ రెడ్డి(G Kishan Reddy). ఆయన ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. బాధితులకు భరోసా కల్పించారు. నేరుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో మాట్లాడారు. పరిస్థితిని వివరించారు. వరద ఉధృతికి చిక్కుకు పోయిన గ్రామాల పరిస్థితిని, నిరాశ్రయులైన బాధిత కుటుంబాల గురించి తెలిపారు.
ఈ సందర్భంగా ఎలాంటి సహాయం అవసరమైనా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని హామీ ఇచ్చారు అమిత్ షా. ఇదే విషయాన్ని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం అకౌంట్లలో డబ్బులు ఉన్నా ఎందుకు ఖర్చు చేయడం లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కు సూచించారు. ఈ నిధులను మృతుల కుటుంబాలకు పరిహారంగా , దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతుల కోసం వినియోగించాలని స్పష్టం చేశారు. ఇందుకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
Also Read : AAP Slams CM : హిమంత బిస్వా పై ఆప్ గుస్సా