G Kishan Reddy : బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే
బీజేపీ చీఫ్ జి. కిషన్ రెడ్డి
G Kishan Reddy : భారతీయ జనతా పార్టీ చీఫ్ , కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి(G Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉదహరించారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని , తాము కూడా భాగస్వాములుగా ఉంటామని అన్నారని ఎద్దేవా చేశారు.
G Kishan Reddy Said
దీని వల్ల అర్థం అవుతున్నది ఏమిటంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని అన్నారు. ఇక తేల్చు కోవాల్సింది, ఆలోచించాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రజలేనని స్పష్టం చేశారు జి. కిషన్ రెడ్డి.
తెలంగాణ ప్రభుత్వం పదే పదే మోదీ సర్కార్ పై ఆరోపణలు చేస్తూ వస్తోందని వాపోయారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నామని కానీ బీఆర్ఎస్ మాత్రం వాస్తవాలు తెలుసు కోకుండా అవాకులు చెవాకులు పేలుతోందని మండిపడ్డారు బీజేపీ స్టేట్ చీఫ్.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు భరించే స్థితిలో లేరని, వారికి బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు జి. కిషన్ రెడ్డి. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ధ్వజమెత్తారు.
Also Read : Jailer Movie Record : అమెరికాలో రజనీ జైలర్ రికార్డ్