G kishan Reddy : హైద‌రాబాద్ పేరు మారుస్తాం

స్ప‌ష్టం చేసిన జి. కిష‌న్ రెడ్డి

G kishan Reddy : హైద‌రాబాద్ – భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్‌, కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జి. కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

హైద‌రాబాద్ న‌గ‌రానికి సంబంధించి పేరు మారుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ హైద‌ర్ ఎవ‌రు..ఆయ‌న‌కు ఈ న‌గ‌రానికి ఏం సంబంధం అని ప్ర‌శ్నించారు. ఆయ‌న నిజాం కాలానికి సంబంధించిన వ్య‌క్తి. ఆయ‌న పేరుతో న‌గ‌రం ఉండ‌డాన్ని తాము ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు జి.కిష‌న్ రెడ్డి.

G kishan Reddy Comment

హైద‌రాబాద్ కు బ‌దులు భాగ్య‌న‌గ‌రం అని పేరు పెడ‌తామ‌ని అన్నారు. ఇక రాష్ట్రంలో బీజేపీకి అనూహ్య‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌న్నారు. గ‌త మూడు రోజులుగా బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం మోడీ, షా, న‌డ్డా రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారంలో పాల్గొన్నార‌ని పేర్కొన్నారు.

బీజేపీ మేనిఫెస్టోను ఒక ప‌విత్ర‌మైన గ్రంథంగా భావిస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు జి. కిష‌న్ రెడ్డి(G kishan Reddy). స‌మ‌ర్థ‌వంత‌మైన పాల‌న‌ను అందించే ఏకైక పార్టీ ఈ దేశంలో బీజేపీయేన‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని చెప్పారు.

టాటా కాంగ్రెస్ బై బై బీఆర్ఎస్ వెల్ క‌మ్ అంటూ బీజేపీ నినాదాలు వినిపిస్తున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్. కారు షెడ్డుకు పోవ‌డం ఖాయ‌మ‌ని , క‌మ‌లం వికసిస్తుంద‌న్నారు.

Also Read : MLC Kavitha : రాహుల్ కామెంట్స్ క‌విత సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!