G Kishan Reddy KCR : సింగరేణి కాదది కల్వకుంట్ల కంపెనీ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్
G Kishan Reddy KCR : నిన్నటి దాకా సీఎం కేసీఆర్(CM KCR) ఫ్యామిలీ పట్ల మెతక వైఖరిని అవలంభిస్తూ వచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నట్టుండి ఎదురుదాడి ప్రారంభించారు. ఆయన సింగరేణి పరిశ్రమపై మాట్లాడారు. అది పూర్తిగా కల్వకుంట్ల కంపెనీగా మారిందని ఎద్దేవా చేశారు.
తాము ఎట్టి పరిస్థితుల్లో సంస్థను ప్రైవేటీకరించే ప్రసక్తి లేదని జనం సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేశారని అన్నారు. అయినా కావాలని లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందన్నారు కేంద్ర మంత్రి(G Kishan Reddy). అవాస్తవాలను ఇంకెంత కాలం ప్రచారం చేస్తారంటూ ప్రశ్నించారు.
ఏదైనా మాట్లాడితే లేదా విమర్శలు చేస్తే తగిన ఆధారాలు ఉండాలన్నారు. ఏది పడితే అది మాట్లాడితే జనం ఊరుకోరని స్పష్టం చేశారు. హద్దులు దాటి మాట్లాడటం అలవాటుగా కల్వకుంట్ల ఫ్యామిలీకి మారి పోయిందన్నారు. తను ఏం మాట్లాడుతున్నాడో సీఎం కేసీఆర్ కే తెలియడం లేదన్నారు.
రాజకీయ ప్రయోజనం కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక లాభాల సిరులు కలిగిన గనిగా పేరొందిన సింగరేణిని ఆగం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు కేంద్ర మంత్రి(G Kishan Reddy).
తాడిచర్లలో నాణ్యమైన బొగ్గు లేదంటూ సర్కార్ నివేదిక ఇచ్చిందని, కానీ తాము జరిపిన సర్వేలో బాగానే ఉందని తేలిందన్నారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయని అన్నారు కిషన్ రెడ్డి. మంత్రి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
Also Read : సీబీఐ రాక సర్వత్రా ఉత్కంఠ