G Niranjan : టీపీసీసీ ఫిర్యాదుతో దిగొచ్చిన ఈసీ

లేఖ రాసిన చైర్మ‌న్ జి. నిరంజ‌న్

G Niranjan : టీపీసీసీ చైర్మ‌న్ జి. నిరంజ‌న్ చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించింది. ఈ మేర‌కు ప్ర‌స్తుతం రాష్ట్రంలో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. న‌వంబ‌ర్ 30న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. డిసెంబ‌ర్ 3న ఫ‌లితాలు రానున్నాయి. రైతు బంధు ప‌థ‌కం కింద నిధుల‌ను కేవ‌లం ఎన్నిక‌ల ముందే వేయ‌డం పూర్తిగా ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయ‌డం త‌ప్ప మ‌రోటి కాద‌ని పేర్కొన్నారు నిరంజ‌న్(G Niranjan) త‌న లేఖ‌లో. ఈ మేర‌కు ఆయ‌న కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు.

G Niranjan Comment

రైతు బంధుకు సంబంధించి ఈనెల 25న ఈసీ నిధులు విడుద‌ల చేయొచ్చంటూ అనుమ‌తి ఇచ్చింది. అయితే ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేలా మంత్రి హ‌రీశ్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నిన్న పెన్ష‌న్ ఇచ్చామ‌ని రేపు న‌వంబ‌ర్ 28న మంగ‌ళ‌వారం మీ ఖాతాల్లో డ‌బ్బులు ప‌డ‌తాయ‌ని , టింగు టింగు మంటూ మీ ఫోన్లు మోగుతాయంటూ చెప్పారు. అంతే కాదు ఇక మీ పెద్ద కొడుకు కేసీఆర్ ను మీరు మ‌రిచి పోరంటూ స్ప‌ష్టం చేశారు.

ఈ మొత్తం వ్య‌వ‌హారం ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్టేలా ఉందంటూ , ఇది పూర్తిగా ఎన్నిక‌ల చ‌ట్టాల‌ను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని , ఇదే రైతు బంధు ప‌థ‌కం కింద ఇంత‌కు ముందు ఇవ్వ‌కుండా ఎందుకు నిలిపి వేశారంటూ ప్ర‌శ్నించారు లేఖ‌లో జి. నిరంజ‌న్. హ‌రీశ్ చేసిన కామెంట్స్ పై స్పందించింది ఈసీ. ఈ మేర‌కు రైతు బంధును ఆపాల‌ని ఆదేశించింది.

Also Read : Rahul Gandhi Sensation : రాహుల్ జోష్ రేవంత్ ఖుష్

Leave A Reply

Your Email Id will not be published!