Indonesia Hands G20 : భార‌త్ కు జీ20 సార‌థ్య బాధ్య‌త‌లు

ప్ర‌ధాని మోదీకి ఇండోనేషియా అప్ప‌గింత‌

Indonesia Hands G20 : భార‌త దేశానికి కీల‌క‌మైన బాధ్య‌త‌లు నిర్వ‌హించే అవ‌కాశం జీ20 రూపంలో ద‌క్కింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వ ప్ర‌తిభ‌, ద‌క్ష‌త‌, నిబ‌ద్ద‌త‌ను మ‌రోసారి నిరూపించుకునేందుకు వీలు చిక్కింది. న‌వంబ‌ర్ 15, 16ల‌లో ఇండోనేషియా లోని బాలిలో జీ20 శిఖరాగ్ర స‌ద‌స్సు జ‌రిగింది.

ఇందులో 19 స‌భ్య దేశాలు పాల్గొన్నాయి. బ్రిట‌న్ , ఇండియా, అమెరికా, చైనా, ఇండోనేషియా, ఫ్రాన్స్ , ఆస్ట్రేలియా, త‌దిత‌ర దేశాల‌కు చెందిన ప్ర‌ధానులు, అధ్య‌క్షులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా డిసెంబ‌ర్ 1 నుంచి జీ20 సార‌థ్య బాధ్య‌త‌లు భార‌త్ కు(Indonesia Hands G20) అప్ప‌గించారు ఇండోనేషియా దేశాధిప‌తి.

జీ20 లో ప్ర‌ధాన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల స‌మూహం ఉమ్మ‌డి నాయ‌కుల డిక్ల‌రేష‌న్ ను ఆమోదించింది. ఇత‌ర భాగ‌స్వామ్యాల‌ను రూపొందించింది. ఇండోనేషియా అధ్య‌క్షుడు జోకో విడోడో బాలిలో జ‌రిగిన కూట‌మి నేత‌ల శిఖ‌రాగ్ర స‌మావేశం ముగింపు సంద‌ర్భంగా జీ20 అధ్య‌క్ష ప‌ద‌విని అధికారికంగా భార‌త్ కు అప్ప‌గించారు.

20 ప్ర‌ధాన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల స‌మూహం ఇందులో కీల‌క పాత్ర పోషించాయి. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క అంశాల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుతం యావ‌త్ ప్ర‌పంచాన్ని తీవ్రంగా క‌లిచి వేస్తున్న‌ది ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్దం. ఇదే స‌మ‌యంలో భార‌త దేశం గ‌త కొంత కాలంగా సాధించిన విజ‌యాల గురించి ఏక‌రువు పెట్టారు.

మ‌రో వైపు యుకె ప్ర‌ధాని రిషి సున‌క్ , చైనా చీఫ్ జిన్ పింగ్ , అమెరికా అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ తో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా భార‌తీయ నిపుణుల‌కు శుభ‌వార్త చెప్పారు యుకె పీఎం.

Also Read : మోదీ బ‌హుమ‌తుల‌తో దేశాధినేత‌లు ఫిదా

Leave A Reply

Your Email Id will not be published!