G20 Leaders Tribute : ఓ మహాత్మా ఓ మహర్షీ
నివాళులు అర్పించిన నేతలు
G20 Leaders Tribute : న్యూఢిల్లీ – దేశ రాజధాని న్యూఢిల్లీలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ప్రపంచానికి తన శాంతి సందేశంతో విస్తు పోయేలా చేసిన మహనీయుడు జాతిపిత మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. ఆయనను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు చెందిన నాథు రామ్ గోడ్సే నమస్కరిస్తూనే కాల్చి చంపాడు. ఆ సమయంలో మహాత్మా గాంధీ కోపగించు కోలేదు. హే రామ్ అంటూ నేలకొరిగాడు.
G20 Leaders Tribute to Gandhi Ji
గాంధీ సమాధిని న్యూ ఢిల్లీలోని రాజ్ ఘట్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆదివారం జి20కి నాయకత్వం వహిస్తోంది నరేంద్ర దామోదర దాస్(PM Modi) నాయకత్వంలోని భారత దేశం. ఈ మేరకు ప్రపంచానికి చెందిన దిగ్గజ దేశాధినేతలు తరలి వచ్చారు .
ఈ సందర్భంగా ప్రముఖులంతా రాజ్ ఘట్ వద్దకు చేరుకున్నారు. భారీ భద్రత మధ్య దేశాధినేతలు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. శాంతి , సేవ, కరుణ, అహింసకు బ్రాండ్ అంబాసిడర్ గాంధీ అని కొనియాడారు.
జి20కి హాజరైన ప్రతి ఒక్కరు మహాత్ముడిని స్మరించుకున్నారు. ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీజీ జీవితం ప్రపంచానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆయన ఆచరించిన జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తి దాయకంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్బంగా వారిని గుర్తుకు తెచ్చుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని స్పష్టం చేశారు.
Also Read : Chandrababu Naidu Jail : చంద్రబాబుకు రాజమండ్రి జైలేనా..?