Gaddam Prasad Kumar : న‌లుగురికి ప్యాన‌ల్ స్పీక‌ర్లుగా ఛాన్స్

ఎంపిక చేసిన స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్

Gaddam Prasad Kumar : హైద‌రాబాద్ – తెలంగాణ శాస‌న స‌భ స‌భాప‌తి గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్(Gaddam Prasad Kumar) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం నాలుగ‌వ రోజు శాస‌న స‌భ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. ఈ సంద‌ర్బంగా ప్యానెల్ స్పీక‌ర్ల‌ను నియ‌మించారు. ఈమేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Gaddam Prasad Kumar Comment

స్పీక‌ర్ లేని స‌మ‌యంలో న‌లుగురు శాస‌న స‌భ్యులు ప్యానెల్ స్పీక‌ర్లుగా కొన‌సాగుతారు. ఇది అనాది నుంచి కొన‌సాగుతూ వ‌స్తున్న సంప్ర‌దాయం. స్పీక‌ర్ లేని స‌మ‌యంలో, లేదా సెల‌వులో ఉన్న స‌మ‌య‌లో లేదా ఇత‌ర ప‌నుల మీద ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లిన స‌మ‌యంలో స్పీక‌ర్ స్థానంలో ప్యానెల్ స్పీక‌ర్లుగా నియ‌మితులైన వారు స‌భ‌ను నిర్వ‌హిస్తారు.

తాజాగా కొత్త‌గా స‌ర్కార్ కొలువు తీరింది. ఇప్ప‌టికే ప్రొటెం స్పీక‌ర్ గా అక్బ‌రుద్దీన్ ఓవైసీ నిర్వ‌హించారు. ఆయ‌న‌కు ఛాన్స్ ఇవ్వ‌డంపై బీజేపీ త‌ప్పు ప‌ట్టింది. చివ‌ర‌కు ఆయ‌న ఉన్నంత వ‌ర‌కు స‌భ‌లోకి రాలేదు బీజేపీ ఎమ్మెల్యేలు.

తాజాగా స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ న‌లుగురికి ప్యానెల్ స్పీక‌ర్లుగా అవ‌కాశం ఇచ్చారు. అనుభ‌వం ఆధారంగా వీరిని ఎంపిక చేసిన‌ట్లు తెలిపారు. ఇక ప్యానెల్ స్పీక‌ర్లుగా నియ‌మించిన వారిలో రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి, బాలూ నాయ‌క్, కౌస‌ర్ మొహియుద్దీన్, కూనంనేని సాంబ‌శివ రావు ఉన్నారు.

Also Read : CM Revanth Reddy : కేసీఆర్ కు కాంగ్రెస్ రాజ‌కీయ భిక్ష‌

Leave A Reply

Your Email Id will not be published!