Gaddar Final Rites : ప్ర‌జా యుద్ద నౌక అంతిమ యాత్ర‌

త‌ర‌లి వ‌చ్చిన క‌వులు, క‌ళాకారులు, ప్ర‌ముఖులు

Gaddar Final Rites : ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ అంతిమ యాత్ర(Gaddar Final rites) కొన‌సాగింది. దారి పొడ‌వునా వేలాది మంది త‌ర‌లి వ‌చ్చారు. క‌డ‌సారి చూపు కోసం ప్ర‌జా యుద్ద‌నౌక‌ను ద‌ర్శించుకునేందుకు. క‌వులు, క‌ళాకారులు, గాయ‌నీ గాయ‌కులు, వివిధ వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌ముఖులు, సినీ న‌టులు, రాజ‌కీయ పార్టీల‌కు చెందిన నాయ‌కులు, ప్ర‌జా సంఘాల నేత‌లు గ‌ద్ద‌ర్ అంతిమ‌యాత్ర‌లో పాల్గొన్నారు.

Gaddar Final Rites Huge Crowd

గ‌ద్ద‌ర‌న్న అంతిమ యాత్ర‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు న‌డిచారు. జ‌న గాయ‌కుడి పార్థివ దేహం తీసుకు వెళుతున్న వాహ‌నంలో మాజీ ఎంపీ మ‌ధు యాష్కి గౌడ్ , ప్ర‌జా గాయ‌కుడు జ‌య‌రాజ్ , మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి చీఫ్ మంద కృష్ణ మాదిగ, త‌దిత‌రులు ఉన్నారు.

గ‌ద్ద‌ర్ అంతిమ యాత్ర లాల్ బ‌హ‌దూర్ స్టేడియం నుండి గ‌న్ పార్క్ , అమ‌ర వీరుల స్థూపం , అంబేద్క‌ర్ మీదుగా సాగింది. అల్వాల్ లోని ఆయ‌న నివాసం వ‌ర‌కు కొన‌సాగింది. గ‌ద్ద‌ర్ పార్థివ దేహాన్ని కొంత సేపు ఉంచుతారు. ఆయ‌న స్థాపించిన మ‌హా బోధి విద్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో ప్ర‌భుత్వ అధికారిక లాంఛ‌నాల‌తో అంతిమ సంస్కారాలు నిర్వ‌హించ‌నున్నారు.

Also Read : Paritala Sriram : గ‌ద్ద‌ర‌న్న బ‌తికే ఉంటాడు – శ్రీ‌రామ్

Leave A Reply

Your Email Id will not be published!