Gaddar Mass Voice : గ‌ద్ద‌ర్ మాస్ వాయిస్

క్యూ క‌ట్టిన ప్ర‌ముఖులు

Gaddar Mass Voice : గ‌ద్ద‌ర్ ఇక లేడు. ఇక రాడు. కానీ అల్లిన పాట‌లు , చెప్పిన మాట‌లు క‌ల‌కాలం నిలిచే ఉంటాయి. ఒక వ్య‌క్తి కోట్లాది మందిని ప్ర‌భావితం చేసిన చ‌రిత్ర చాలా అరుదు. ప్ర‌పంచంలో క‌వి,గాయ‌కులు కొద్ది మంది మాత్ర‌మే ఉన్నారు. మ‌హా క‌వి శ్రీ‌శ్రీ అన్న‌ట్లు గ‌ద్ద‌ర్ మ‌హా గాయ‌కుడు. అంతే కాదు ఆయ‌న పాల్ రాబ్స‌న్ లాంటి వాడ‌న్నారు.

Gaddar Mass Voice People Remember

వ్య‌వ‌స్థ‌ల‌ను నిల‌దీసి, నిగ్ద‌దీసి పాట‌ల‌తో ప్ర‌శ్నించిన యోధుడు.. ప్ర‌జా వాగ్గేయ కారుడు గ‌ద్ద‌ర్. ల‌క్ష‌లాది మందిని త‌న ఆట‌, పాట‌ల‌తో ఒక్క‌సారిగా విభ్రాంతి చెందేలా చేసిన ఘ‌న‌త ఆయ‌న‌కే ద‌క్కుతుంది. న‌క్స‌ల్ ఉద్య‌మంలో ఉన్నా బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌జా పోరాటాల‌కు ఊపిరిగా మారినా గ‌ద్ద‌ర్ కే చెల్లింది.

ఇవాళ స్టేడియం మొత్తం గ‌ద్ద‌ర్ అమ‌ర్ ర‌హే, జోహార్ గ‌ద్ద‌ర‌న్నా అంటూ నినాదాలు మిన్నంటాయి. ప్ర‌జ‌ల కోసం గానం చేసిన గాయ‌కులు అరుదు. శ‌రీరంలో తూటాలు దిగినా కేవలం జ‌నం కోసం జీవితాన్ని అంకితం చేసిన అరుదైన సింగ‌ర్ గ‌ద్ద‌ర్(Gaddar Mass Voice) అలియాస్ గుమ్మ‌డి విఠ‌ల్ రావు.

అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఇంత‌లా ప్ర‌భావితం చేసిన గాయ‌కుడు ఈ మ‌ధ్య కాలంలో ఎవ‌రూ లేర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ దేశమంతా తిరగ‌డ‌మే కాదు సామాజిక ఉద్య‌మాల‌కు ఊపిరి పోసిన ఏకైక గొంతుక గ‌ద్ద‌ర్. ఇవాళ గ‌ద్ద‌ర్ లేక పోవ‌డం అణ‌గారిన వ‌ర్గాల‌కు చెప్ప‌లేని దుఖాఃన్ని క‌లిగించింది. తీర‌ని వేద‌న‌ను మిగిల్చింది.

Also Read : Actor Ali Gaddar : ప్ర‌జా వాగ్గేయ‌కారుడు గ‌ద్ద‌ర్ – ఆలీ

Leave A Reply

Your Email Id will not be published!