Gaddar Passes Away : ప్రజా గాయకుడు గద్దర్ ఇక లేడు
దివి కేగిన దిగ్గజ ప్రజా యుద్ద నౌక
Gaddar Passes Away : ప్రముఖ విప్లవ కవి, రచయిత, గాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆదివారం కన్నుమూశారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం అపోలో ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు(Gaddar Passes Away). కోట్లాది మందిని తన ఆట పాటలతో ఉర్రూత లూగించారు గద్దర్. ఆయన పూర్తి పేరు గుమ్మడి విట్ రావు. 1949లో పుట్టారు.
Gaddar Passes Away Revolutionary poet
భారత దేశంలోనే పేరు పొందిన ప్రజా గాయకుల్లో ఒకడిగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు. నక్సలైట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2010 వరకు నక్సలైట్ ఉద్యమంలో చురుకుగా ఉన్నారు.
ఆయన పాడిన పాటలు తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేశాయి. ఆయన పాటల్ని వినని వారంటూ లేరు. యువత ఎక్కువగా తన గానానికి ప్రభావితమయ్యారు. నక్సలైట్ ఉద్యమంలో చేరేలా చేశాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఖమ్మంలో చేపట్టిన జన గర్జన సభకు హాజరయ్యారు గద్దర్ . ఆయనను అక్కున చేర్చుకున్నారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ.
ఒక తరాన్ని ప్రభావితం చేస్తూ వచ్చిన ప్రజా గాయకుడు లేరన్న వార్త విషాదాన్ని నింపింది.
Also Read : CM KCR Tribute : తెలంగాణ గాంధీకి కేసీఆర్ దండం