Gaddar Poem : గద్దర్ కవిత సంచలనం
ప్రజా యుద్ద నౌక రాసిన కవిత
Gaddar Poem : కోట్లాది మంది ప్రజలను తన ఆట, పాటలతో చైతన్యవంతం చేసిన అరుదైన గాయకుడు ప్రజా యుద్ద నౌక గద్దర్ నింగికేగాడు. ఆయన అంతిమ యాత్ర తెలంగాణ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచి పోయేలా చేసింది. ఒకరా ఇద్దరా వేలాది మంది జనం చివరి చూపు కోసం తరలి వచ్చారు. తండోప తండాలుగా తమను ప్రభావితం చేస్తూ, తమకు అండగా నిలుస్తూ వచ్చిన గద్దరన్న ఇక నుంచి చూడలేమని, ఆ గొంతు వినలేమంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
Gaddar Poem The last letter
పెద్ద ఎత్తున తొక్కిస లాట జరిగింది. ఎల్బీ నగర్ స్టేడియం నుంచి గద్దర్(Gaddar) అంతిమయాత్ర 17 కిలోమీటర్ల పాటు కొనసాగింది. ఆయన నివాసం ఆల్వాల్ కు వచ్చేందుకు 6 గంటలకు పైగా సమయం పట్టింది. ఎక్కడ చూసినా జనమే..ఇసుక వేస్తే రాలనంత జనం. గద్దర్ అమర్ రహే అంటూ నినాదాలతో హోరెత్తింది. ప్రపంచంలో ఎందరో కవి, గాయకులు ఉన్నా..కేవలం ప్రజా యుద్ద నౌకకు మాత్రమే ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అందరూ పాడుతూ వెళ్లి పోయారు. మరికొందరు ఉరి కొయ్యలను ముద్దాడారు. కానీ గద్దర్ మాత్రం తన శరీరంలో తూటాను పెట్టుకుని చివరి దాకా జనం కోసం పాడాడు.
ఈ సందర్భంగా చని పోయే కంటే ముందు ఆయన ఎర్రటి అక్షరాలతో కవితను రాశారు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. నా దేశంలో నా ప్రజలు మనుషులుగా గుర్తించ బడరో , అంత కాలం, ఈ తిరుగుబాటు గీతం పాడుతూనే ఉంటాను. నా జాతి, నా వారసత్వాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ కవిత ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇదే ప్ల కార్డులలో దర్శనం ఇచ్చింది.
Also Read : CM KCR Zaheeruddin : సియాసత్ ఎడిటర్ మృతి తీరని లోటు