Gaddar Salute : చివరి చూపు కోసం పోటెత్తిన జనం
ప్రజా యుద్ద నౌకకు మరణం లేదు
Gaddar Salute : గద్దర్ మరణంతో ఒక శకం ముగిసింది. కొన్ని తరాలను తన ఆట, పాటలతో ప్రభావితం చేస్తూ వచ్చిన యోధుడు , ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ . ఇవాళ ఆయన నిస్తేజంగా ఉన్నారు. లాల్ బహదూర్ స్టేడియంలో గద్దర్ భౌతిక కాయం ఉంచారు. ఆయన చివరి చూపు కోసం వేలాది మంది జనం తండోప తండాలుగా తరలి వచ్చారు.
Huge crowd saying Gaddar salute
ప్రపంచాన్ని ప్రభావితం చేసిన , కదలించిన అతి కొద్ది మంది కవులు, గాయకులలో గద్దర్ ఒకరు. ఆయన ప్రధాన స్రవంతిని మెస్మరైజ్ చేశారు తన పాటలతో. అజరామరమైన కీర్తిని పొందాడు. నక్సల్ ఉద్యమానికి ఊపిరి పోసిన గద్దర్ ఇవాళ లేక పోవడం, లోకాన్ని వీడడం అత్యంత బాధాకరం. తెలుగు నేలను, తెలంగాణ సమాజాన్ని కదిలించిన ఏకైక గాయకుడు గద్దర్(Gaddar Salute).
మానవులను మనుషులుగా పరిగణించాలి, గౌరవించాలి అనేది ఆయన ఫిలాసఫీ. అందుకోసం గానం చేశాడు. అందు కోసమే బతికాడు. వారి కోసమే రాశాడు. పాటలు కట్టాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాడిన పాటలు పోలీసులను కూడా కంటతడి పెట్టేలా చేశాయి.
అన్ని వర్గాలకు చెందిన వారంతా ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి తరలి రావడంతో లాల్ బహదూర్ స్టేడియం క్రిక్కిరిసి పోయింది. అద్భుతమైన పాటలతో పేదలు, అణగారిన వర్గాల గొంతుకగా మారిన గద్దర్ ఇవాళ మౌనంగా ఉండడాన్ని జనం జీర్ణించు కోలేక పోతున్నారు.
Also Read : Actor Ali Gaddar : ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ – ఆలీ