Gajendra Singh Shekhawat : కేసీఆర్ అవినీతిలో అనకొండ
సీఎంపై నిప్పులు చెరిగిన భారతీయ జనతా పార్టీ
Gajendra Singh Shekhawat : భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసింది. దేశంలోనే అవినీతిలో అనకొండగా మారాడని అక్రమాలకు అడ్డాగా మారిందంటూ ధ్వజమెత్తింది.
బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్టలో జరిగిన బహిరంగ సభలో మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Shekhawat), కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షెకావత్ సంచలన కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎం లాగా మారిందని ఆరోపించారు.
జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్న సీఎం ముందు నీటి ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి పర్మిషన్ లేదని, అందుకే ఎలాంటి హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ప్రాజెక్టు పేరుతో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలకు సీఎం కేసీఆర్, ఫ్యామిలీ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి.
ఇంజనీరింగ్ లోపం వల్లనే ప్రాజెక్టు పంప్ హౌస్ లు నీట మునిగియాంటూ ధ్వజమెత్తారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి. రాష్ట్రంలో అవినీతి పరులను జైల్లో వేసేందుకు తమ పార్టీకి అధికారం ఇవ్వాలన్నారు.
అణగారిన, బహుజన కులాల వారంటే కేసీఆర్ కు గిట్టదని అందుకే ఆదివాసీ తెగకు చెందిన మహిళ రాష్ట్రపతిగా పోటీ చేస్తే మద్దతు ఇవ్వలేదంటూ మండిపడ్డారు.
రాక్షస పాలన సాగిస్తున్న సీఎంను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు బండి సంజయ్ కుమార్ పటేల్. నయీం నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ, డబ్బులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : అప్పుల కుప్ప జనం నెత్తిన గుదిబండ